Daily Current Affairs In Telugu || 10 November 2023 || By Notifications Academy

  పర్యావరణ ఆస్కార్ (ఎకో ఆస్కార్లు)

  •  ఈ పర్యావరణ ఆస్కార్ అవార్డుని Earth Shot బహుమతి అని కూడా పిలుస్తాం
  •  బ్రిటిష్ యువరాజు అయిన ప్రిన్స్ విలియం ఈ అవార్డుని స్థాపించడం జరిగింది
  •  ఈ బహుమతుల యొక్క ప్రధానోత్సవం అనేటువంటిది ప్రతి ఏడాది జరుగుతుంది
  • పర్యావరణపరంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు గాని సవాళ్లు గాని సాంకేతికతతో పరిష్కారం చూపే సంస్థలకు ప్రోత్సాహకం అందించడం కోసం ఈ అవార్డులను అందించడం జరుగుతుంది 
  •  ఈ బహుమతులు గెలిచినటువంటి గ్రహీతలకు 10 లక్షల ఫౌండ్లు నగదును అందించడం జరుగుతుంది (10 కోట్ల రూపాయలు)
  •  ఈ ఏడాది ఈ అవార్డును ఐదు సంస్థలు గెలుచుకుంటే
  •  అందులో రెండు సంస్థలు భారత్ చెందిన సంస్థలు ఉండడం విశేషం.
  •  ఏంటా ఆ రెండు సంస్థలు అంటే
  •  1) S4S (సైన్స్ ఫర్ సొసైటీ)
  •  2) భూపుత్ర సంస్థ
  •  భారతదేశంలో ఆహార వృధాను అరికట్టడానికి కృషి చేస్తున్నందుకు S4S సంస్థకు
  •  ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతున్న భూపుత్ర సంస్థ కు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది
11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK

 37వ జాతీయ క్రీడలు 
  • ఈ 37వ జాతీయ క్రీడాలని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గోవాలోని జవహర్ లాల్ నెహ్రూ యొక్క స్టేడియంలో ఈ క్రీడలను ప్రారంభించడం జరిగింది
  •  ఈ నేషనల్ గేమ్స్ అనేవి ఇండియన్ ఒలంపిక్ గేమ్స్ గా ప్రసిద్ధి గాంచాయి
  •  ఈ యొక్క జాతీయ క్రీడలు అనేవి స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభించబడ్డాయి
  •  1924 సంవత్సరంలో లాహార్ కేంద్రంగా మొట్టమొదటిసారిగా జాతీయ క్రీడలు నిర్వహించబడితే,
  •  స్వాతంత్రం అనంతరం 1948 వ సంవత్సరంలో లక్నో కేంద్రంగా 13వ జాతీయ క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి
  •  37 వ జాతీయ క్రీడలనేవి గమనించాలి
  •  దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం గోవా అని గుర్తించాలి
  •  ఈ యొక్క 37వ జాతీయ క్రీడల్ని అక్టోబర్ 25 నుంచి నవంబర్ 9 వరకు ఈ క్రీడలనేవి నిర్వహించడం జరిగింది.
  •  సుమారు 20 రోజులపాటు క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి.
  •  ముగింపు వేడుకకు ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ దన్ ఖడ్ గారు హాజరు కావడం జరిగింది
  •  పథకాల పట్టికలో
  •  మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిస్తే
  •  ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో
  •  తెలంగాణ 22వ స్థానాల్లో నిలిచాయి
11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK
 
 Global TB Report 2023 
  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న TB కి సంబంధించి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది
  •  TB అంటే ట్యూబర్క్లోసిస్ గా చెప్తాము
  •  దీన్నే తెలుగులో క్షయ వ్యాధి అంటాము
  • ఈ క్షయ వ్యాధి అనేది మైకొ బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ వల్ల కలిగే ఒక ఇన్ఫెక్షన్ అని గుర్తించాలి
  •  ఇది శరీరంలోని ఏదైనా ఒక అవయవాన్ని ప్రభావితం చేస్తుంది.
  •  దాంట్లో ప్రధానంగా
  •  ఊపితిత్తులు
  •  ఫ్లూరా
  •  శొషరస గ్రంధులు
  •  ప్రేగులు వెన్నెముక
  •  మరి ముఖ్యంగా మెదడు వీటిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది
  •  దీని యొక్క లక్షణాలు
  •  కోరింత దగ్గు
  •  దగ్గుతున్నప్పుడు రక్తం రావడం
  •  ఛాతి నొప్పి
  •  బలహీనం కావడం
  •  బరువు తగ్గడం
  •  రాత్రుల్లో చెమటలు పట్టడం
  •  జ్వరం
  •  ఈ నివేదికను 2023లో విడుదల చేసినప్పటికీ కూడా 2022 నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది అని గుర్తించాలి
  •  ప్రపంచంలోనే అత్యధిక TB కేసులు భారతదేశం లోనే ఉన్నాయని చెప్తుంది
  •  కోవిడ్ 19 తర్వాత ఆ స్థాయిలో మరణాలు అనేవి ఈ ఇన్ఫెక్షన్ ద్వారానే సంభవించాయి అని చెబుతుంది
  •  అలాగే ఈ TB కారణంగా హెచ్ఐవి మరియు ఏడ్స్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మరణాలు సంభవించాయి అని, ప్రతి సంవత్సరం పది మిలియన్లకు పైగా ప్రజలు TBతో అనారోగ్యం బారిన పడుతున్నారు అని ఈ నివేదిక చెప్తుంది
  •  ప్రపంచవ్యాప్తంగా 100% కేసులు నమోదయితే అందులో87% TB కేసులనేవి ఈ 30 అధిక భారం ఉన్నటువంటి దేశాల నుండే నమోదు కావడం జరుగుతుంది
  • ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, మరియు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదలగు దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా 87% TB కేసులు అనేవి ఇక్కడి నుంచే నమోదు కావడం అనేది జరుగుతుంది
11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK

 సుప్రీంకోర్టులో నూతన జడ్జీలు
  •  సుప్రీంకోర్టులో నూతన జడ్జిలకు సంబంధించి ప్రమాణస్వీకారం అనేది జరిగింది.
  •  జస్టిస్ సచిస్ చంద్రశర్మ
  •  జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్
  •  జస్టిస్ సందీప్ మెహతాలు
  •  వీరు ముగ్గురు కూడా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు
  •  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రశర్మ పనిచేస్తే
  •  రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ పనిచేసారు
  •  గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సందీప్ మెహతా బాధ్యతలు నిర్వర్తించారు
  •  ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిజెఐ జస్టిస్ డివై చంద్రచుడ్ నేతృత్వంలోని కొలిజం ఈనెల ఆరో తేదీన సిఫార్సు చేసింది
  •  So చంద్రచుడ్ నేతృత్వంలోని కొలిజం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి వీరి నియామకానికి సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది
  •  ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియమకంతో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య 34 చేరడం జరిగింది ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి
11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK

బేరియం ఉన్న బాణాసంచా పై నిషేధం
  •  బేరియం కలిసి ఉన్న సాంప్రదాయ రకాల బాణాసంచాను కాల్చడానికి సంబంధించి మనకు గతంలోని ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయబడ్డాయి
  •  2018 వ సంవత్సరంలో ఈ ఉత్తర్వులు జారీ చేయబడడం అనేటువంటిది జరిగింది
  •  ఈ ఉత్తర్వులు అప్పుడు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యాయి కానీ తాజాగా ఈ యొక్క ఉత్తర్వులు అనేటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేయడం జరిగింది
  •  బాణాసంచా దుష్ప్రభావాల గురించి సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కీలకం
  •  ప్రస్తుత రోజుల్లో పిల్లల కంటే పెద్దవారే బాణాసంచా కాలుస్తుండడం విచారకరం
  •  కాలుష్యం పర్యావరణ పరిరక్షణ అనేవి న్యాయస్థానాలు చూసుకోవలసిన విధి అనేది తప్పుడు భావన
  •  వాయు ,ధ్వని కాలుష్యం విషయాలకు అడ్డుకట్ట వేయడం ప్రతి ఒక్క కర్తవ్యం అని జస్టిస్ గోపన్న జస్టిస్ సుందరేశ్ ల ధర్మాసనం మంగళవారం ఈ అంశాల గురించి పేర్కొనడం జరిగింది
11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

11/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
09/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK



Comments