Daily Current Affairs In Telugu || 20 November 2023 || By Notifications Academy

  భారత ఆర్థిక వృద్ధి

  •  2024-26 ఆర్దిక సంవత్సరాలలో భారత ఆర్థిక వృద్ధి రేటు అనేది ఏటా 6 నుంచి 7.1 శాతం మేర నమోదు అవుతుంది అని ప్రముఖ ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది
  •  ఏప్రిల్ ఒకటో తేదీతో ప్రారంభమై మార్చి 31 వ తేదీతో ముగిస్తే దానిని ఒక ఆర్థిక సంవత్సరంగా చెప్తాము
  •  గ్లోబల్ బ్యాక్స్ కంట్రీ బై కంట్రీ అవుట్ లుక్ 2024  నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది
  •  భారత వాస్తవ జీడీపీ రేటు అనేది 6.1 శాతంగా నమోదయింది
  •  మార్చి త్రైమాసికం నాటికి 6.1 శాతంగా నమోదైన భారత వాస్తవ జీడీపీ రేటు అనేది జూన్ త్రైమాసికానికి ఆ యొక్క జిడిపి అనేది 7.8 శాతానికి పెరిగింది
  • 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, మరీ ముఖ్యంగా జపాన్ ను అధిగమిస్తుందని ఈ సంస్థ గతంలోనే తన నివేదికలో చెప్పింది
  •  ఇప్పుడు తాజాగా భారత వృద్ధిరేటుకు సంబంధించి ఈ సంస్థ తన నివేదికను రూపొందించింది
23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

 విశ్వసుందరిగా షెన్నిస్
  •  విశ్వ సుందరిని ఇంగ్లీషులో Miss Universeగా పిలుస్తాము
  •  సెంట్రల్ అమెరికా లోని నికారాగువా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ నూతన విశ్వసుందరిగా అవతరించారు
  •  ఈ పోటీలు అనేవి నికారాగువా దేశానికి సంబంధించినంత వరకు ఇది తొలి విజయం అని గుర్తించాలి
  •  ప్రస్తుత విశ్వసుందరిగా షెన్నిస్ పలాసియోస్ ని పేర్కొంటే,
  •  బాని గాబ్రియల్ ని మాజీ విశ్వసుందరిగా పేర్కొనడం అనేది జరుగుతుంది
  •  మాజీ విశ్వసుందరి అయిన బాని గాబ్రియల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి అభినందనలు తెలియ జేయడం జరిగింది
  •  ఈ ప్రతిష్టాత్మక  ‘‘మిస్ యూనివర్స్ 2023’’ పోటీలు నవంబర్ 19 న నిర్వహించబడ్డాయి
  •  ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు
  •  థాయిలాండ్ - ఆంటోనియా ఫోర్సిల్డ్ - మొదటి రన్నరప్
  •  ఆస్ట్రేలియా - మొరాయ విల్సన్ - రెండో రన్నరప్
  •  భారతదేశ౦ నుంచి శ్వేతా శారద తొలి 20 జాబితాలో నిలవడం జరిగింది
23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
  •  ఈ పురస్కారాన్ని ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం అని కూడా పిలుస్తాము
  •  మానవాళికి అసాధారణమైన సేవలు అందించినటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకు అదే విధంగా సంస్థలకు సత్కరించడం కోసం ఈ బహుమతుల్ని అందించడం జరుగుతుంది
  •  20వ శతాబ్దపు అద్భుత నేతల్లో ఒకరైనా ఇందిరా గాంధీ గారి పేరు మీద ప్రతి ఏటా ఈ అవార్డుల ప్రధానోత్సవం చేయడం అనేది జరుగుతుంది
  •  ఈ పురస్కారాన్ని1986 లో ప్రారంభించారు
  •  తొలుత PGA parliamentarians for global action వారికి ఇవ్వడం జరిగింది
  •  వీటి ప్రధానోత్సవం న్యూఢిల్లీ లో జరుగుతుంది
  •  గ్రహీతలకు 25 లక్షల రూపాయలు అందిస్తారు
  •  ప్రస్తుతం ఈ పురస్కారాన్ని భారత కోవిడ్ వారియర్లు గెలుచుకున్నారు
  •  వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ గారు
  •  అలాగే భారత ట్రైన్డ్ నర్సుల సంఘం ప్రెసిడెంట్ రాయ్ కే జార్జ్ ఈ పురస్కారాన్ని  అందుకున్నాయి
  •  కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని ప్రతి వైద్యుడు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వీరందరూ కూడా
  •  ఈ మహమ్మారి సమయంలోఅందించిన నిస్వార్థ సేవలు, చూపిన అంకితభావం ,పట్టుదలకు నిర్దర్శనంగా ఈ అవార్డును అందించడం జరిగింది
23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్
  •  ఇంగ్లాండులో సస్ సెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణాన్ని బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేర్కొంటాము
  •  ఇక్కడ ప్రతిఏటా నవంబర్ మాసంలో బోన్ ఫైర్ వేడుకలు అనేటువంటి ఘనంగా నిర్వహించబడతాయి
  •  దాంట్లో భాగంగా ప్రతి వీధిలో కూడా భోగిమంటలాంటి చలి మంటలు కలిగిన నెగళ్లను ఏర్పాటు చేస్తారు
  •  దానితోపాటు సాంప్రదాయ వేషాధారణతో కాకడాలు వెలిగించి ఊరేగింపు తీస్తారు
  •  అలాగే బాణాసంచాను కాలుస్తారు
  •  ఈ యొక్క వేడుకను పండగల నిర్వహిస్తారు
  •  బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన పట్టణం ఏది? 
  •  లెవెస్ పట్టణ౦ 
23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

 SPG
  •  SPG - Special Protection Group
  •  ప్రధానమంత్రి యొక్క రక్షణ బాధ్యతను చూసే ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ గా ప్రస్తావిస్తాం
  •  ఈ యొక్క ప్రత్యేక దళానికి నవంబర్ 17న కొత్త డైరెక్టర్ గా అలోక్ శర్మ నియమితులు కావడం జరిగింది
  •  ఈ అలోక్ శర్మ 1991 బ్యాచ్ కు  చెందిన IPS అధికారి
  •  ప్రస్తుతం వీరు SPG లో అదనపు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు
23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

23/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK



Comments