Daily Current Affairs In Telugu || 09 November 2023 || By Notifications Academy

అణ్వస్త్ర ఆందోళనలు

  •  మగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పంద నుంచి రష్యా బయటికి రావడం
  •  ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర ఆందోళనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు
  •  దీనినే ఇంగ్లీషులో Comprehensive Nuclear Test Ban Treaty గా పేర్కొంటాం
  •  ఈ ఒప్పందం 1996వ సంవత్సరంలో జరిగింది 
  •  ఈ ఒప్పందంపై 187 దేశాలు సంతకాలు చేశాయి
  •  178 దేశాలు మాత్రమే ఈ ఒప్పందాన్ని సజావుగా అమలు చేయాలని నిర్ణయించాయి
  •  భారత్ మరియు పాకిస్తాన్ తో పాటు మిగిలిన 9 దేశాలు ఈ CTBT పై సంతకాలు చేయలేదు
  •  ఏ ఒప్పందాని కైనా రెండు పద్ధతులు ఉంటాయి
  • 1) సిగ్నేచర్
  • 2) రాటిఫికేషన్
  •  సిగ్నేచర్ అంటే :- ఒక దేశం యొక్క ప్రతినిధి అంతర్జాతీయంగా ఆ ఒప్పందానికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోవడం
  •  రాటిఫికేషన్ :- ఏ దేశమైతే ఆ ఒప్పందం మీద సంతకం చేస్తుందో ఆ దేశం యొక్క పార్లమెంట్లో ఆ దేశం ఆ ఒప్పందం ప్రకారం దేశీయంగా చట్టాలు చేయడం జరుగుతుంది
  •  ఈ CTBT ఒప్పందంపై 187 దేశాలు సిగ్నేచర్ చేస్తే
  •  178  సిగ్నేచర్ + రాటిఫికేషన్ చేయడం జరిగింది
  •  ఇందులో భారత్, పాకిస్తాన్ , నార్త్ కొరియా సిగ్నేచర్ రాటిఫికేషన్ ఈ రెండు చేయలేదు
  •  అమెరికా సిగ్నేచర్ చేస్తే రాటిఫికేషన్ చేయలేదు
  •  రష్యా మాత్రం సిగ్నేచర్ + రాటిఫికేషన్ రెండు చేసింది
  •  ప్రస్తుతం రష్యా ఈ రాటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని డి రేటిఫికేషన్ చేసుకుంది
  •  దానికి గల కారణం
  •  ఈ CTBT కి సంబంధించిన అంశం పైన అమెరికా రాటిఫికేషన్ చేసుకోకపోవడం 
  •  Ratify చేసుకున్న రష్యా కూడా డి రాటిఫై చేసుకొని అమెరికా సరసన నిలిచింది 
  •  భారత్ విషయానికి వచ్చినట్లయితే
  •  భారత్ రాటిఫికేషన్ చేయలేదు అలా అని సైన్ కూడా చేయలేదు
  •  దానికి గల కారణం
  •  అన్వస్త్ర పరీక్షలతోపాటు, అన్వాయిదాలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భారత్ దీర్ఘ కాలంగా ఎదురుచూస్తుంది =} డిమాండ్ కూడా చేస్తుంది
  •  1954 వ సంవత్సరంలో అమెరికా క్రేజీల్ బ్రావో పేరుతో అణు పరీక్షలు నిర్వహించింది
  •  ఆ పేలుడుకి సంబంధించిన తీవ్రత అనేది హిరోషిమా కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉండటం జరిగింది
  •  ఎప్పుడైతే దాని తీవ్రత 100 రెట్ల కంటే అధికంగా ఉందని తెలిసిందో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజం భయంతో వణికిపోయింది
  •  ఈ పరీక్షల కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దీవుల్లో ఉన్న సముద్ర జలాలపై కొన్ని ఏళ్ల పాటు రేడియేషన్ కీ దారితీసింది
  •  అమెరికా ఈ అణు పరీక్షలు చేసిన తర్వాత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అమెరికా చేసిన ఈ అణు పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు
  •  అన్వాస్త్రాలను కలిగిన దేశాలు అవి లేని వాటిపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందని వాదించడం కూడా జరిగింది
  •  కాకపోతే 1964 సంవత్సరంలో ఎప్పుడైతే చైనా అణు పరీక్షలు నిర్వహించిందో పొరుగునున్నటువంటి దేశంతో ప్రమాదం ఉందని భావించిన భారత్ ఈ సిటీబీటీ పైన సంతకం చేయడానికి నిరాకరించింది
  •  భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే అణు పరీక్షలను నిర్వహించింది
  •  మొదటగా 1974 సంవత్సరం పోఖ్రన్ కేంద్రంగా మొదటిసారి అణు పరీక్షలు నిర్వహిస్తే
  •  రెండోసారి 1998వ సంవత్సరం లో చైనా సాయంతో పాకిస్తాన్ అన్వాయిదాలు సమకూర్చుకొనుందన్నా నిఘా వర్గాల సమాచారంతో
  •  1998 సంవత్సరంలో భారత్ రెండోసారి అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది
10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

వందే సాధారణ్ రైల్
  •  ఏసీ అవసరంలేని ప్రయాణికుల కోసం కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లను వందే సాధారణ్ రైళ్లు గా పేర్కొంటాం
  •  తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు
  •  అత్యంత ప్రాచుర్యం పొందిన వందే భారత రైళ్ల తరహాలోనే వీటిని కూడా రూపొందించారు
  • కానీ వందే భారత్ రైలుకు ఉండే అత్యున్నతమైన వసతులు ఈ రైలుకు ఉండవని గ్రహించాలిఅంటే అర్థం ఏసీ సౌకర్యంగాని , ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే  Doors గాని ఇలాంటి వసతులు ఉండవని అభ్యర్థులు గమనించాలి
  •  ఈ వందే సాధారణ్ రైళ్లు యొక్క ప్రత్యేకతలు
  •  ఈ రైల్లో 12 స్లీపర్ కోచ్లు 8 అన్ రిజర్వ్ డ్  బోగీలు ఉన్నాయి
  •  ఈ సాధారణ రైల్లో రెండు చివరల ఇంజన్ను కలిగి ఉంటాయి ఆ రెండు ఇంజిన్ లను సిగ్నలింగ్, ట్రాక్ ల వీలుని బట్టి వినియోగిస్తారు
  •  ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి భోగిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు
  •  భోగి లోపల అదునాతనమైన సాంకేతికతతో  కూడుకున్న వసతులు ఏర్పాటు చేయబడ్డాయి
  •  గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ వందే సాధారణ్ రైళ్లు ప్రయాణం చేస్తాయి
  •  ఒకేసారి 1834 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కూడా ఇవి కలిగి ఉన్నాయి
  •  మొదటి దశలో ఐదు మార్గాల్లో ఈ సాధారణ రైళ్ళను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది ఏంటా 5 మార్గాలు అంటే
  •  ముంబై - ఢిల్లీ
  •  పాట్నా- ఢిల్లీ
  •  హవ్ డా - ఢిల్లీ
  •  హైదరాబాద్ - ఢిల్లీ
  •  ఎర్నాకులం - గువాహాటి
  •  మరో 30 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అడుగులు వేస్తుంది
  •  తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పుకుందాం కదా
  •  అందులో భాగంగానే ముంబై నుంచి అహ్మదాబాద్ మద్య ఈ వందే సాధారణ్ రైల్ యొక్క ట్రయల్ రన్ అనేది విజయవంతం కావడం జరిగింది
10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

భారత్ నుంచే అత్యధిక యూనివర్సిటీలు
  •  ఆసియా దేశాల్లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక క్వాకరెల్లి సైమండ్స్(QS) అనే సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం ర్యాంకులను విడుదల చేసింది
  •  ఈ ర్యాంకుల్లో మన దేశం నుంచి ప్రఖ్యాతి  విశ్వవిద్యాలయాలైన
  •  ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ తొలి 50 స్థానాల్లో నిలిచాయి
  •  ఐఐటి బాంబే 40వ స్థానాన్ని సంపాదిస్తే
  •  ఐఐటి ఢిల్లీ 46వ స్థానంలో చోటు సంపాదించుకుంది
  •  ఈ యొక్క నివేదికను రూపొందించడం కోసం ప్రముఖ క్యూఎస్ (QS) అనే సంస్థ దాదాపుగా ఆసియా కాంటినెంట్ లో ఉన్న 856 యూనివర్సిటీలను పరిశీలించడం జరిగింది
  •  ఈ యొక్క జాబితాలో
  •  భారత్ నుంచి అత్యధికంగా 148 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించుకుంటే
  •  చైనా నుంచి 133 విశ్వవిద్యాలయాలు
  •  జపాన్ నుంచి 96 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది
  •  ఇక మయన్మార్, కాంబోడియా, నేపాల్ ఈ జాబితాలో తొలిసారిగా మెరిసాయి
  •  గతేడాది ఇదే నివేదికలో భారత్ నుంచి 111 యూనివర్సిటీలు ఎంపిక అయితే ఈ ఏడాది ఆ సంఖ్య అనేది 148 చేరింది ఈ విషయాన్ని గమనించాలి
10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

UK , లాఫింగ్ గ్యాస్ కి సంబంధించిన అంశం
  •  నైట్రస్ ఆక్సైడ్ ను మనం లాఫింగ్ గ్యాస్ గా పిలుచుకుంటాము
  •  వినోద భరిత కార్యకలాపాల కోసం వినియోగించడాన్ని బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది
  •  దానికి గల కారణం
  •  ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే డ్రగ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనతన బారిన పడేటువంటి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
  •  దీన్ని యొక్క తీవ్రత గనక ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతం వచ్చేటటువంటి ప్రమాదం ఉందని కూడా వారు పేర్కొనడం జరిగింది
  •  బ్రిటన్ లోని 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారే ఈ డ్రగ్ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది
  •  వారందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ ప్రభుత్వం నైట్రస్ ఆక్సైడ్ ను నిషేధించింది 
  •  మినహాయింపు ఇచ్చిన అంశాలు
  •  హెల్త్ సెక్టార్
  •  కొన్ని పరిశ్రమలకు చట్టబద్ధంగా వినియోగిస్తున్నటువంటి వాటికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది 
10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం
  •  ప్రతి ఏటా నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తాము
  •  దానికి గల కారణం
  •  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది వేరుపడింది అనగా కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయబడింది
  •  2000 సంవత్సరం నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి వేరుపడి భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించింది
  •  తొలినాళ్లల్లో ఉత్తరాంచల్ పేరుతో ఏర్పాటు కావడం జరిగింది
  •  ఈ 2007వ సంవత్సరంలో ఆ ఉత్తరాంచల్ పేరుని ఉత్తరాఖండ్ గా మార్చారు
  •  ఉత్తరాఖండ్ అనేటువంటి పదం సంస్కృత మాండలికం నుంచి వచ్చింది
  •  ఉత్తరాఖండ్ అంటే అర్థం ఉత్తర నగరం
  •  ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు
  •  ప్రకృతి సౌందర్యానికి, సాంస్కృతిక వైవిధ్యానికి, మతపరమైన ప్రాముఖ్యతకు పెట్టింది పేరు
  •  చార్ధామ్ , బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి నాలుగు పవిత్ర హిందూ పుణ్యక్షేత్యాలకు నిలయంగా ఈ ప్రాంతం నిలిచింది
  •  యునెస్కో వారు గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించి ఉత్తరాఖండ్ నుంచి రెండు ప్రదేశాలు దీంట్లో చోటు సంపాదించుకున్నాయి
  •  వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్
  •  నందాదేవి నేషనల్ పార్క్
10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

10/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
08/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :- LINK



Comments