Daily Current Affairs In Telugu || 30 October 2023 || By Notifications Academy

One Nation One Student ID Card
  • ఇటీవల కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్ర పరిధిలో ఉన్న స్కూళ్లకు కొత్తగా One Nation One Student ID Card ను రూపొందించడానికి తల్లిదండ్రుల యొక్క అనుమతిని కోరమని ఆ పాఠశాలలకు ఆదేశించడం జరిగింది 
  •  దీనినే APAAR ID అని కూడా పిలుస్తాం
  • స్టూడెంట్స్ కోసం డిగ్రీలు, స్కాలర్షిప్లు రివార్డులు మరియు ఇతర క్రెడిట్లు వీటన్నిటితో సహా అకాడమిక్ డాటాను డిజిటల్  ఐడి రూపంలో కేంద్రీకరించడాన్నే APAAR ID గా పేర్కొంటాం
  • ఈ వివరాలను విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క సమ్మతి తీసుకున్న తర్వాతే అనగా వారి అనుమతి తీసుకొన్న తర్వాతే ఈ నమోదు ప్రక్రియ అనేది కొనసాగుతుంది
  • వారు దానిని ఏ సమయంలోనైనా ఉపసంహరించుకోవచ్చు
  • ఈ APAAR ID అనేది డిజి లాకర్ కు ఒక గేట్ వేగా ఉపయోగపడుతుంది
  • APAAR =} AUTOMATED PERMANENT ACADEMY REGISTRY 
  • ఈ APAAR ID ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు 
  • ఈ APAAR ID అనేది కొత్త జాతీయ విద్యా విధానం 2020 లో భాగము అని గుర్తించాలి 
TODAY PDF File :-  LINK
31/10/2023 PDF File :- LINK

KAZIND 2023
  • భారత్ మరియు కజకిస్తాన్ యొక్క సంయుక్త సైనిక విన్యాసాలను KAZIND గా పేర్కొంటాం
  • ఈ యొక్క సైనిక విన్యాసాన్ని తొలుత 2016 సంవత్సరంలో ప్రారంభించారు 
  • ఎక్ససైజ్ ప్రబల్ దోస్తీక్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది 
  • 2018లో ఈ సైనిక విన్యాసాన్ని కజిందు పేరుగా మార్చారు
  • ఇప్పటి వరకు మనకు KAZIND కి సంబంధించి ఆరు ఎడిషన్లు జరిగాయి 
  • ఇప్పుడు జరగబోయే ఎడిషన్ ఏడవ ఎడిషన్ అని గుర్తించాలి 
  • ఈ ఏడవ ఎడిషన్ కి సంబంధించిన సైనిక విన్యాసాలను అక్టోబర్ 30 నుంచి నవంబర్ 11 వరకు కజకిస్తాన్ లోని ఒటార్ కేంద్రంగా నిర్వహించడం జరుగుతుంది 
  • ఈ యొక్క సైనిక విన్యాసాల్లో పదాతి దళం (Indian army), వాయు దళం (Indian Air force) ఈ రెండు దళాలు కూడా ఈ విన్యాసాల్లో పాలుపంచుకుంటున్నాయి
  • లక్ష్యం 
  • సానుకూల సైనిక సంబంధాలు పెంపొందించుకోవడం
  • ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్మూలించేటప్పుడు ఒకరికొరకు పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడం
TODAY PDF File :-  LINK
31/10/2023 PDF File :- LINK

ఖతార్ లో నేవీ మాజీ సిబ్బందికి మరణశిక్ష
  • ఇటీవల ఖతార్ కోర్టు గూఢఛారం ఆరోపణలతో భారత నావికాదానికి చెందిన 8 మంది మాజీ నావి సిబ్బందికి మరణశిక్ష విధించడం జరిగింది 
  • దానికి గల కారణం 
  • సున్నితమైనటువంటి రహస్యాలను అతిక్రమించారు అనేటువంటి ఆరోపణలతో గతేడాది ఆగస్టు నెలలో వీరిని అరెస్టు చేశారు
  • ప్రస్తుతం వీరికి ఖతర్ కోర్టు మరణశిక్ష విధించడం జరిగింది 
  • ఈ ఎనిమిది మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వీరు ఖతర్ లోని 
  • AL Dahra Global Technologies and consultant services అనే సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు 
  • ఈ సంస్థ నుంచి విలువైన సమాచారాన్ని అతిక్రమించారనే ఆరోపణలతో గత ఏడాది వీరిని అరెస్టు చేయడం జరిగింది
  • ఈ 8 మందికి మరణశిక్ష విధించారే కానీ వారు చేసిన ఆ నిర్దిష్ట ఆరోపణలకు సంబంధించిన ఆ విషయాన్నిఏ మాత్రం బహిర్గతం చేయలేదు
TODAY PDF File :-  LINK
31/10/2023 PDF File :- LINK

Abua Awas Yojana
  • ఇటీవల ఝార్ఖండ్ క్యాబినెట్ Abua Awas Yojana కు సంబంధించిన ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది 
  • ఈ పథకం గృహ నిర్మాణానికి సంబంధించిన పథకం
  • ఈ పథకం ద్వారా ఆ రాష్ట్రంలో నిరాశ్రయులైనటువంటి నిరుపేదలకు ఎనిమిది లక్షల పక్కా ఇళ్లను ఈ పథకం ద్వారా నిర్మించడం జరుగుతుంది
  • ఈ ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు 16320 కోట్లు
  • వీటిని మూడు దశల్లో నిర్మిస్తున్నారు
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ఇళ్లు       =} Phase -1
  • 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3.5 లక్షల ఇల్లు     =} Phase - 2
  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల ఇళ్లను   =} Phase - 3 
  • నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు
  • ఈ పథకం కింద 31 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడు గదులు,& ఒక వంట గది నిర్మించబడుతుంది 
  • అలాగే ప్రభుత్వం తన బడ్జెట్లో ఒక్కో లబ్ధిదారునికి రెండు లక్షల వరకు కేటాయించి వీటిని నాలుగు విడతలుగా పంపిణీ చేస్తుంది 
  • ఈ ఇంటి నిర్మాణంలో టాయిలెట్స్ ని కూడా జోడించాలనేటువంటి నిబంధన కూడా ఉంది ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి ఫండ్స్ ను స్వచ్ఛభారత్ మిషన్ నుంచి వచ్చే నిధులను గాని లేదా మరి ఏదైనా స్కీమ్ నుంచి వచ్చేటువంటి నిధులను వాడుకోవాలని ఈ అంశంలో పేర్కొన్నారు 
  • అబూ ఆవాస్ యోజన కింద నిర్మించబడే ఇల్లు అన్నీ కూడా ఆ లబ్ధిదారుడి కుటుంబం లో ఉన్న మహిళల పేర్ల మీద నమోదు చేయబడతాయి
  • ఈ పథకం ద్వారా లబ్ధిదారున్ని ఎంపిక చేయడం కోసం కొన్ని అర్హతలు , అనార్హతలను నిర్ణయించారు 
TODAY PDF File :-  LINK
31/10/2023 PDF File :- LINK


ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

TODAY PDF File :-  LINK
31/10/2023 PDF File :- LINK

TODAY PDF File :-  LINK












Comments