Daily Current Affairs In Telugu || 08 November 2023 || By Notifications Academy

 Elon Musk కి సంబంధించి కొత్త చాట్ బాట్

  •  డ్రైవర్ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష అంతర్జాలం వంటి ఎన్నో ప్రయోగాలకు పెట్టింది పేరు ఈ Elon Musk
  •  అటువంటి Elon Musk ఇప్పుడు కృతిమ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు
  •  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI గా ప్రస్తావిస్తాం
  •  ఆయన కంపెనీ వచ్చేసి X AI
  •  ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా AI నమునాను పరిచయం చేసింది
  •  దాని పేరు వచ్చేసి గ్రాక్ అని చెప్పి చెప్తాము
  •  ఈ గ్రాక్ అనేది ఒక చాట్ బాట్
  •  చాట్ బాట్ అంటే అర్థం మనుషులతో సంభాషణ అనుకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని చాట్ బాట్ గా పేర్కొంటాము
  • ఈ చాట్ బాట్ గురించి Elon Musk తన యొక్క సామాజిక మాధ్యమైనా X ద్వారా అనగా ట్విట్టర్ ద్వారా ఈ చాట్ బాట్ గురించి వెల్లడించడం జరిగింది
  •  ఈ చాట్ బాట్ అనేది ఓపెన్ ఏఐకి చెందిన జిపిటి కి, గూగుల్ కు చెందిన పామ్ కి ప్రత్యామ్నాయం కలిగిన ఓ పెద్ద లాంగ్వేజ్ మోడల్ అని గుర్తించాలి
  •  చాట్ జిపిటి , పామ్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది
  • 1) ఈ గ్రాక్ అనేది ఎక్స్ లో మాత్రమే పనిచేస్తుంది
  • 2) ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK

ఆదిత్య - L1
  •  సూర్యుడు పై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము
  •  ఆ సూర్యయాన్ పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగాన్ని ఆదిత్య - L1 గా పేర్కొంటాము
  •  Polar Satellite Launching Vehicle c-57 వాహన నౌక ద్వారా 1475 కిలోల బరువు కలిగిన భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య - L1 నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
  •  2023 సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
  •  శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక అయినా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV c57 వాహన నౌకా సహాయంతో ఆదిత్య - L1 అనే ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి ప్రయోగించారు

  •  దీని యొక్క లక్ష్యం
  •  భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ బిందువు 1 (L1-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
  •  ప్రవేశపెట్టి గ్రహణాలతో సంబంధం లేకుండా సౌర గోళం పై నిరంతరం అధ్యయనం చేస్తారు
  •  ముఖ్యంగా సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించడం దీని యొక్క లక్ష్యం

  •  ఆదిత్య L1 ఉపగ్రహాం యొక్క ప్రత్యేకతలు
  •  ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1475 కేజీలు
  • 1) సూర్యుడికి ఉన్న మరో పేరు ఆదిత్య
  • 2) ఈ ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ అనే బిందువు వద్ద ప్రవేశ పెట్టాలి అనుకున్నారు కాబట్టి Lఅని,
  • 3) ఇది సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహము కావున 1 అని
  •  ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రొఫెసర్ యు ఆర్ రావు స్పేస్ సెంటర్లో URSC ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు
  • URSC సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఆదిత్య L1 ఉపగ్రహానికి రూపకల్పన చేయడం జరిగింది
  •  సౌర జ్వాలలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1 ఉపగ్రహం
  •  సూర్యుడు పై లోతైన పరిశోధన కోసం భారత్ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము అందులో భాగంగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది
  •  ఈ ఆదిత్య L1 ఉపగ్రహాం సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని చిత్రాలను తీయగలిగింది
  •  సౌర జ్వాలలు అంటే సౌర వాతావరణం ఆకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటాం
  •  ఆ సౌర జ్వాలలకు సంబంధించిన చిత్రాలను ఇప్పుడు ఆదిత్య L1 తీయడం జరిగింది
  •  HEL1OS అనే పరికరం సహాయంతో ఈ చిత్రాలను తీయగలిగింది
  •  సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చర్యలను పరిశీలించి అధిక రిజల్యూషన్ లో ఈ చిత్రాలు మనకు అందిస్తుంది
  •  సూర్యుడిలోని విస్పోటక శక్తి ఎలక్ట్రాన్ త్వరణం ఇలాంటి మరిన్ని వివరాలను ఈ యొక్క పరికరం నుంచి మనం పొందడానికి అవకాశం ఉంటుంది
09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK

 ప్రళయ్ క్షిపణి
  •  ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను చేదించగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రళయ్ క్షిపణి గా ప్రస్తావిస్తాం
  •  ఈ ప్రళయ్ క్షిపణి ని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది
  •  ఒడిశా తీరానికి చేరువలో ఉన్న అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించడం అనేటువంటిది జరిగింది
  • ఈ ప్రయోగంలో క్షిపణి యొక్క గమనాన్ని తీరం వెంబడి ఉన్న టాకింగ్ పరికరాలు పూర్తిస్థాయిలో నిశితంగా పరిశీలించడం జరిగింది

  •  ఈ ప్రళయ్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు 
  •  ఈ క్షిపణి 300 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది
  •  అది మాత్రమే కాదు ఈ క్షిపణి 500 - 1000 కిలోల పేలోడ్ ను మోసుకెళ్ళగలుగుతుంది
  •  ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది
  •  ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ఇస్కాండర్ క్షిపణి తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది
  •  దీనిని చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు
  •  DRDO వారు రూపొందించారు
09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK

 పంట వ్యర్ధాల దహనానికి సంబంధించిన అంశం
  •  దేశ రాజధాని ఢిల్లీ లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ హర్యానా ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు పంట వ్యర్ధాలను తగలబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయామని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది
  •  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుదాన్షు దునియాల ధర్మాసనం ఈ ఆదేశాలను ఇవ్వడం జరిగింది
  •  కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడాన్ని చూస్తూ ఊరుకోలేమని ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని హతమార్చడమే ఇంతకు మించిన పదబంధం నా వద్ద లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది
  •  కాలుష్యానికి తాము భాద్యులం కాదంటూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెబుతుండడంపై ఆయన స్పందిస్తూ రాజకీయ వైరం అన్నివేళలా తగదని ఢిల్లీ లో వాయు నాణ్యత పడిపోవడానికి సంబంధించిన సమస్యకు పూర్తిగా అడ్డుకట్ట పడాల్సిందేనని అది ఎలా చేస్తారో మాకు అనవసరంకానీ వ్యర్థాలను కాల్చడం మాత్రం ఆగి పొవాలి
  •  దానికి నిర్బంధ చర్యలే తీసుకుంటారో, ప్రోత్సాహకాలే ఇస్తారో, ఇతరత్రా చర్యలే చేపడుతారు అది మీ ఇష్టం వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది
09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK

 కృత్రిమ వర్షాలతో వాయు కాలుష్యానికి చెక్
  •  వాటికి పరిష్కారంగా ఐఐటి కాన్పూర్ విద్యార్థులు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు
  •  కృత్రిమ వర్షాల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వారు ఈ ప్రయోగం ద్వారా తెలియపరచడం జరిగింది
  •  ఈ కృతిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటి కాన్పూర్ విద్యార్థులకు దాదాపు 5 ఏళ్ల సమయం పడింది
  •  ఈ ప్రయోగంలో ఒక ప్రత్యేకమైన విమానం ద్వారా రసాయానాలను మేఘాలలో చల్లి సంబంధిత ప్రాంతంలో వర్షాలు కురిపించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది
  •  తద్వారా కాలుష్యాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది
  •  అమెరికా, చైనా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వంటి దేశాల్లో సహజంగానే నీటి కొరత ఏర్పడుతుంది
  •  అలా నీటి కొరత ఏర్పడినప్పుడు వారందరూ కూడా ఈ పద్ధతిని పాటించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి
09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

09/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
07/11/2023 PDF File :-  LINK


TODAY PDF File  :- LINK




Comments