Daily Current Affairs In Telugu || 07 November 2023 || By Notifications Academy

డోక్లాం పై కన్నేసిన డ్రాగన్

  • భారత్, భూటాన్ ల మధ్య ఎప్పటినుంచో మనకు సన్నిహిత సంబంధాలు బలంగా ఉన్నాయి 
  • ఈ రెండు దేశాల మధ్య 1949 సంవత్సరంలో స్నేహ పూర్వక మరియు సహకార ఒప్పందానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది  
  • ఈ ఒప్పందం ప్రకారం :-
  • భారత్ భూటాన్ యొక్క సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ ఉండాలి
  • ఆ దేశ విదేశాంగ విధానానికి భారతదేశం మార్గదర్శకత్వం వహిస్తూ ఉండాలి. 
  • అది మాత్రమే కాదు ఉమ్మడి భద్రతకు సంబంధించి భరోసాన కల్పించాలి 
  • ఈ ఒప్పందం ప్రకారమే భారత్ సైన్యం భూటాన్ లో స్థావరాలు ఏర్పరచుకుంది 
  • చైనా-భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో పహారాను కాస్తుంది
  • భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్ లో పలు మౌలిక వసతులను కూడా నిర్మించింది 
  • భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణను కూడా అందిస్తుంది
  • నాటి ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ గారు భూటాన్ పై దాడిని భారత్ పై దాడిగానే పరిగణిస్తామని 1958 లో నెహ్రూ గారు పార్లమెంటులో ప్రకటించడం కూడా జరిగింది
  • నెహ్రూ గారు పార్లమెంట్లో ఈ ప్రకటన ప్రకటించడాని కంటే ముందే చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది
  • చైనా యొక్క వర్షన్ 
  • చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాదు లడక్ నేపాల్ సిక్కిం భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా టిబేట్ ప్రాంతానికి సంబంధించి చేతికి అయిదు వేళ్ళు గా ప్రకటించింది
  • భూటాన్ లోని డోక్లాంతో సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్ దబాయిస్తుంది

08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK

జికా వైరస్

  • ఇటీవల కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ గ్రామం నుండి సేకరించిన దోమల నమూనాలో జికా వైరస్ ను గుర్తించడంతోని ఈ అంశం వార్తల్లో నిలిచింది
  • ఈ జికా వైరస్ కి సంబందించి పుట్టు పూర్వోత్తరాలు:- 
  • ఈ వైరస్ దోమల ద్వారా సంక్రమించే ఒక ఫ్లేవీ వైరస్. 
  • ఇది ప్రధానంగా ఏడేస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది 
  • ఈజిప్టు జాతికి చెందిన ఈడిస్ దోమల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించాలి 
  • ఈ వైరస్ అనేది మొదట ఉగండాలోని జీకా అడవిలో 1947 లో కోతుల్లో కనుగొనబడింది
  • మనిషికి సంబంధించినంత వరకు 1952లో ఉగండా మరియు టాంజానియాలో ఈ కేసులు నమోదయ్యాయి
  • దీని యొక్క లక్షణాలు 
  • జ్వరం 
  • కీళ్ల నొప్పులు 
  • కండరాల నొప్పులు 
  • తలనొప్పి అనేది రెండు నుంచి ఏడు రోజులపాటు ఉంటుంది

08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK

కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా హిరాలాల్  సామారియా

  • తెలంగాణ క్యాడర్ కు చెందిన మాజీ IAS అధికారి అయిన హిరాలాల్ సామారియా కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు 
  • వీరి నేపథ్యం :- 
  • హిరాలాల్ సామరియా 1960 సెప్టెంబర్ 14న రాజస్థాన్లో జన్మించారు 
  • బ్యాచిలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో సివిల్స్ పట్టాను సాధించారు 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణలో వివిధ హోదాల్లో పని చేశారు 
  • అలాగే కొన్నాళ్లు కేంద్ర క్యాడర్ గా పనిచేసి పదవి విరమణ చేయడం జరిగింది
  • ప్రస్తుతం సమాచార హోదాలో బాధ్యతలు కొనసాగిస్తున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ పదోన్నతిని కల్పించింది 
  • సోమవారం ఉదయం రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముగారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు 
  • ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ ఖడ్ గారు వీరు ఇరువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 
  • ఈ నియామకం చేయడానికి గల కారణం :-
  • సమాచార కమిషన్ లో ఖాళీలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్వాజ్యం ఇటీవీల సుప్రీంకోర్టులో విచారణకు రాగా సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రుచుడ్ ధర్మాసనాన్నినిర్దేశించడం జరిగింది అలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నియామకం చేపట్టింది
  • ముఖ్య సమాచార కమిషనర్ నియామకంతో పాటు ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం చేపట్టి౦ది
  • వీరిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ CMD గా పనిచేసిన ఆనంది రామలింగం 
  • అలాగే హిమాచల్ అటవీ శాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్ కం ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ గా పనిచేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోద్ కుమార్ తివారి 
  • వీరి ఇరువురిని కూడా కేంద్ర సమాచార కమిషనర్ గా నియామకం చేపట్టడం జరిగింది
08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK

కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించి అదనపు కార్యదర్శి

  • ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IAS అధికారి అయిన శ్రీకాంత్ నాగులపల్లి కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది
  • ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ఆయనను అదనపు కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది 
  • వారితో పాటు 21 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ వివిధ శాఖలకు బదిలీ చేసింది

08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK

ఈనెల నవంబర్ 13 నుంచి ఢిల్లీలో సరి బేసి విధానం

  • ఢిల్లీలో ఆందోళన స్థాయిలో పెరిగిపోయిన కాలుష్యం యొక్క నియంత్రణకు ఈనెల 13 నుంచి వాహనాలకు సరి బేసి అంకెల విధానాన్ని అమలు చేయాలి అని నిర్ణయించారు 
  • వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క చివరణ 
  • సరి సంఖ్య ఉన్న వాహనాలకు ఒకరోజు 
  • బేసి సంఖ్య ఉన్న వాహనాలకు మరో రోజున రోడ్లపైకి అనుమతించేటటువంటి విధానాన్ని సరి బేసి విధానంగా పేర్కొంటాము
  • ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అయిన గోపాల్ రాయ్ సోమవారం విలేకరులకు వెల్లడించారు 
  • దానికి గల ప్రధాన కారణం
  • ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయిలకు కంటే ఈ కాలుష్యం అనేది ఏడెనిమిది రేట్లు పెరగటంతోని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన పేర్కొనడం జరిగింది

08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 


08/11/2023 PDF File :-  LINK
TODAY PDF File  :- LINK
06/11/2023 PDF File :-  LINK




TODAY PDF File  :- LINK



Comments