Daily Current Affairs In Telugu || 03 November 2023 || By Notifications Academy

 South East Asia కోసం WHO ప్రాంతీయ కమిటీ  76వ సెషన్

  •  ఇటీవల న్యూఢిల్లీలో South East Asia కోసం WHO యొక్క  ప్రాంతీయ కమిటీకి సంబంధించి 76వ సెషన్ జరిగింది
  •  ప్రాథమిక ఆరోగ్య సంరక్ష కేంద్రాల్లో అనగా Primary Health Centre(PHC) లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సమగ్రమైన, సమానమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ను సాధించగలుగుతాం
  •  యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సాధించడంలో Primary Health Centre(PHC) అత్యంత భూమిక పాత్రను పోషిస్తాయి అని డిక్లరేషన్ చేయడం జరిగింది
  •  దీనినే ఢిల్లీ డిక్లరేషన్ అని పిలుస్తాము
  •  భారతదేశానికి సంబంధించినంత వరకు బలమైన ఆరోగ్య వ్యవస్థ ప్రభుత్వంపై మరియు మొత్తం సమాజంపై ఆధారపడింది
  •  Pandemic వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఏం చేయాలో దృష్టిలో పెట్టుకొని
  •  ఆరోగ్య సేవలను అదేవిధంగా ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరచాలని ఈ సదస్సులో పేర్కొనడం  జరిగింది 
06/11/2023 PDF File :- LINK
TODAY PDF File  :- LINK
02/11/2023 PDF File :-  LINK

 ఆగ్నేయ ఆసియాకు WHO రీజినల్ డైరెక్టర్ గా సైమా వాజేడ్ ఎన్నికయ్యారు
  •  ఆ సమావేశం జరిగినప్పుడు WHO యొక్క ప్రాంతీయ కమిటీకి సంబంధించి రీజనల్ డైరెక్టర్గా బంగ్లాదేశ్ కు చెందిన సైమా వాజేడ్ ఎన్నికయ్యారు
  •  బంగ్లాదేశ్ యొక్క ప్రధాన మంత్రి అయిన షేక్ హసీనా కుమార్తె యే ఈ సైమా వాజేడు అని గుర్తించాలి
  •  ఈ 76వ సెషన్ జరిగినప్పుడు తదుపరి రీజనల్ డైరెక్టర్గా ఎవరుండాలని ఓటింగ్ కూడా నిర్వహించబడింది
  •  ఆ ఓటింగ్ లో సైమా వాజేడుకు 8 ఓట్లు వస్తే ఆచార్యకు రెండు ఓట్లు వచ్చాయి
  •  ఈ South East Asia రీజినల్ కమిటీ అనేది WHO యొక్క గవర్నింగ్ బాడీ అని గుర్తించాలి
  •  దీంట్లో ఉన్న సభ్య దేశాలు చూసినట్లయితే మొత్తంగా 11 సభ్య దేశాలు ఉన్నాయి
  •  బంగ్లాదేశ్, భూటాన్, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇండియా, ఇండోనేషియా, మాల్దీవులు, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, తైమూర్ లేస్టే ఇలా మొత్తంగా మనకు 11 దేశాలు సభ్య దేశాలుగా ఉండడం జరిగింది
  •  దీని ప్రధాన కార్యాలయం – న్యూఢిల్లీ అని గుర్తించాలి
06/11/2023 PDF File :- LINK
TODAY PDF File  :- LINK
02/11/2023 PDF File :-  LINK

 రోహిణి నయ్యర్ బహుమతి
  •  ఇంజనీర్ నుండి సామాజిక కార్యకర్తగా మారినటువంటి దీనా నాథ్ రాజ్ పుత్ కు ఈ ఏడాది రోహిణి నయ్యర్ బహుమతికి ఎంపిక కావడం జరిగింది
  •  దీనా నాథ్ రాజ్ పుత్ యొక్క నేపథ్యం
  •  ఇంజనీర్ లాంటి విద్యను అభ్యసించి సామాజిక కార్యకర్తగా మారాడు
  •  ఆరువేల మందికి పైగా గిరిజన మహిళల ఉన్న ఛత్తీస్ ఘడ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రైతు ఉత్పత్తిదారుల సంస్థ అనగా FPO ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్ అనే సంస్థను స్థాపించి ఆ ఆరువేల గిరిజన కుటుంబాల మహిళల జీవితాల్లో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చాడు
  •  గ్రామీణాభివృద్ధికి పాటుపడ్డాడు అదేవిధంగా వారికి అత్యుత్తమైన సహకారాన్ని అందించాడు కాబట్టే ఈ ఎడాది రోహిణి నయ్యర్ ఆ బహుమతికి ఎంపిక కావడం జరిగింది
  •  2021లో మరణించిన పేరున్న గొప్ప ఆర్థికవేత్త రోహిణి నయ్యర్ వారి యొక్క జ్ఞాపకార్థం ఏర్పాటు చేసినటువంటి బహుమతియే రోహిణి నయ్యర్ బహుమతి అని చెప్తున్నాం
  •  రోహిణి నయ్యర్ ప్రైస్ కి సంబంధించి ఇది రెండోవ ఎడిషన్ అని గుర్తించాలి
  •  రోహిణి నయ్యర్ ప్రైస్ అవార్డు గ్రహీతకు 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు
06/11/2023 PDF File :- LINK
TODAY PDF File  :- LINK
02/11/2023 PDF File :-  LINK

 సమగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పంద నుంచి వైదొలిగిన రష్యా
  •  ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో అణ్వాయిదా పరీక్షలు నిషేధించే అంతర్జాతీయ ఒప్పందానికి (CTBT) సంబంధించిన ఒక తీర్మానాన్ని తెరపైకి తీసుకొస్తే దాదాపుగా అన్ని దేశాలు స్వాగతించాయి.
  •  ఈ ఒప్పందం ప్రకారం ఏ దేశం కూడా  అణుపరీక్షలనేవి నిర్వహించకూడదు.
  •  అణుపరీక్ష భారత్ ఇప్పటివరకు రెండుసార్లు మాత్రమే అణు పరీక్షలు నిర్వహించింది
  •  1974 May 18 న తొలిసారి నిర్వహిస్తే 
  •  1998 May 11 రెండోసారి నిర్వహించడం జరిగింది
  •  ఈ ఒప్పందం జరిగిన తర్వాత భారత్ ఏ రోజు కూడా అణు పరీక్షలు అనేవి నిర్వహించలేదు
  •  సమగ్ర అణు పరీక్షలు నిషేధ ఒప్పందం (CTBT) నుంచి రష్యా వైదొలిగింది 
  •  రష్యా పార్లమెంట్లో మనకు రెండు సభలు ఉంటాయి
  •           1) ఎగువ సభ    2) దిగువ సభ
  •  దిగువసభ ని స్టేట్ డ్యూమా అని పిలుస్తారు
  •  ఈ ఉభయ సభలు గత నెల సమగ్ర అణు పరీక్షలు నిషేధ ఒప్పందం రద్దుకు సంబంధించి గత నెల ఏకగ్రీవంగా ఓటు వేయడం జరిగింది
  •  ఉభయ సభలు ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లును ఆ దేశాధ్యక్షుడు అయినా పుతిన్ ఆమోదించడం జరిగింది
06/11/2023 PDF File :- LINK
TODAY PDF File  :- LINK
02/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

06/11/2023 PDF File :- LINK
TODAY PDF File  :- LINK
02/11/2023 PDF File :-  LINK

                                                               PDF :- LINK











Comments