Daily Current Affairs In Telugu || 06 December 2023 || By Notifications Academy

 తలసరి అప్పు

  • తలసరి ఆదాయాన్ని ఇంగ్లీషులో Per Capita Income అంటాము
  • జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం
  • తలసరి ఆదాయాన్ని దేశ అభివృద్ధికి కొలమానంగా సూచిస్తాము 
  • తలసరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత అభివృద్ధి చెందినట్టు 
  • ఆదే తలసరి అప్పు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతగా క్షీణించినట్టు 
  • ఇటీవల తృణముల్ కాంగ్రెస్ సభ్యుడైన అటువంటి డెరెక్ ఓబ్రియన్ తలసరి అప్పు కు సంబంధించి లోక్ సభలో ఈ ప్రశ్నను లేవనెత్తడంతోనీ ఈ అంశం వార్తల్లో నిలిచింది
  • కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనికి సరైనటువంటి వివరణ ఇచ్చారు 
  • గత పది ఏళ్లలో తలసరి అప్పు 101% పైగా శాతం పెరిగింది 
  • తలసరి ఆదాయం మాత్రం కేవలం 62.59% మాత్రమే వృద్ధి చెందింది 
  • 2011-12 మార్చినాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు 29,127 రూపాయలు ఉంటే
  • 2022 -23 మార్చినాటికి 58,709 రూపాయలకి చేరింది 
  • దీంట్లో దేశ తలసరి అప్పు 26,481 నుంచి 55,528 రూపాయలకి చేరడం అనేది జరిగింది
  • ఇక విదేశీ తలసరి అప్పు 2647 రూపాయల నుంచి 3181 రూపాయలకు చేరడం జరిగింది 

TODAY PDF File  :-  LINK
05/12/2023 PDF File  :-  LINK

PM Kisan

  • Pradhan Mantri Kisan Samman Nidhi =} PM Kisan 
  • 2019లో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది 
  • దీని యొక్క ఉద్దేశం 
  • దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించడం 
  • ఈ పథకం ద్వారా ఏడాదికి ఆరువేల రూపాయలు అందిస్తారు 
  • ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు
  • 2018 వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది
  • ఈ పథకం ద్వారా రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు
  • ఈ స్కీమ్ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైంది 
  • ఈ పథకం నుంచి ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం 
  • దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పేరు మీదుగా రైతులకు ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. 
  • ప్రస్తుతం పిఎం కిసాన్ కింద ఇచ్చే 6000 రూపాయల మొత్తాన్ని పెంచే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది 
  • ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ లోక్ సభలో జరిగిన సమావేశంలో తెలియజేసారు

TODAY PDF File  :-  LINK
05/12/2023 PDF File  :-  LINK

భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానం

  • 2030 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది  
  • ఈ విషయాన్ని ప్రముఖ S&P గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ తన నివేదిక లో పేర్కొంది
  • 2023-24 లో 6.4 శాతంగా ఉన్న మన దేశ దేశ జీడీపీ వృద్ధి అనేది
  • 2024-25 నాటికి 6.9% శాతంగా,
  • 2026-27 నాటికి 7% శాతంగా 
  • 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని ఈ S&P గ్లోబల్ సంస్థ తన నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది
  • ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది 
  • భారత్ 2030 నాటికి జపాన్ ని అధిగమించి ఆసియా పసిఫిక్ లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందే అవకాశం ఉంది 
  • 1) అమెరికా 
  • 2) చైనా 
  • 3) జర్మనీ 
  • 4) జపాన్
  • భారత్ ముందున్న సవాళ్లు :- 
  • తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి 
  • తయారీ రంగానికి కేంద్రంగా నిలపడమే భారత్ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు

TODAY PDF File  :-  LINK
05/12/2023 PDF File  :-  LINK

AAAI

  • దీని యొక్క పూర్తి నామం అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 
  • ఈ అసోసియేషన్ కి సంబంధించి డిసెంబర్ 1న సర్వసభ్య సమావేశం జరిగింది 
  • ఈ సమావేశం యొక్క ప్రత్యేకత 
  • అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క 
  • అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ ని ఎంపిక చేస్తే,  
  • ఉపాధ్యక్షుడిగా రానా బారువాను ఎంపిక చేసారు
  • ప్రశాంత్ కుమార్ =} (గ్రూప్ ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణాసియా CEO) 
  • రానా బారువా =} (హవాస్ ఇండియా గ్రూప్ CEO)
  • వీరిరువురిని అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయడంతో పాటు 
  • ఈ అసోసియేషన్ కి పలువురు సభ్యులను కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది

TODAY PDF File  :-  LINK
05/12/2023 PDF File  :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK

TODAY PDF File  :-  LINK
05/12/2023 PDF File  :-  LINK

TODAY PDF File  :-  LINK






Comments