Weekly Current Affairs In Telugu || 06 Nov 2023 To 11 Nov 2023 || By Notifications Academy

 World Athlete Of The Year Award- 2023

  • ఒలంపిక్ మరియు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ జావెలిన్ త్రోయర్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ చోప్రా 
  • ఈ నీరజ్ చోప్రాకు వరల్డ్ అథ్లెటిక్స్ అందించే 2023 పురుషుల వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు సంబంధించి 11 మంది నామినిలో నిలవడం జరిగింది
  • ఈ అవార్డు ఎంపిక ప్రక్రియ అనేది మూడు దశల్లో జరుగుతుంది 
  • 1) వరల్డ్ అథ్లెటిక్ కౌన్సిల్ వారు వేసే ఓట్లు ద్వారా ఎంపిక చేస్తారు 
  • 2) వరల్డ్ అథ్లెటిక్ ఫ్యామిలీ అదేవిధంగా 
  • 3) పబ్లిక్ వేసే ఓట్ల ద్వారా కూడా ఎంపిక చేయడం
  • ఇలా మూడు దశల ద్వారా ఈ అవార్డుకి ఎంపిక చేస్తారు
  • దీంట్లో కౌన్సిల్ యొక్క ఓట్లనేవి 50% వెయిటేజ్ ని కలిగి ఉన్నాయి 
  • ఇక మిగిలిన 50 శాతం ఓట్లు వరల్డ్  అథ్లెటిక్స్ ఫ్యామిలీ అదేవిధంగా పబ్లిక్ ఓట్స్ 
  • ఈ రెండిటిని సమానంగా డివైడ్ చేసి లెక్కించడం జరుగుతుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

AIESC సమావేశం
  • ఆస్ట్రేలియా - ఇండియా ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ కౌన్సిల్ సమావేశాన్ని AIESC సమావేశంగా పేర్కొంటాం 
  • ఈ సమావేశం గుజరాత్ లోని ఐఐటి గాంధీనగర్ లో తొలిసారిగా నిర్వహించబడింది
  • భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య  విద్య మరియు నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందానికి సంబంధించిన కీలక ఘట్టాన్ని సూచిస్తుంది 
  • ఈ AIESC మనకు 2011 సంవత్సరంలోనే ఏర్పాటు కావడం జరిగింది 
  • AIEC పేరుతో ఏర్పాటు అయింది
  • దీని యొక్క లక్ష్యం
  • భవిష్యత్తు శ్రామిక శక్తిని రూపొందించడం 
  • సంస్థాగత భాగస్వామ్యాలను పెంపొందించడం 
  • ఈ అంశాల మీద దృష్టి పెట్టడం ద్వారా రెండు దేశాల మధ్య విద్యా మరియు నైపుణ్య అభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

ATL MARATHON 2023-24
  • ATAL INNOVATION MISSION (AIM) అనే కార్యక్రమానికి నీతి అయోగ్ శ్రీకారం చుట్టింది
  • ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం కి అటల్ టింకరింగ్ ల్యాబ్స్(ATL) MARATHON 2023-24 పేరుతో దరఖాస్తులను ప్రారంభించడం అనేది జరిగింది
  • జాతీయస్థాయి ఆవిష్కరణకు సంబంధించినటువంటి సవాళ్లను వెలిగేతి చూపడం కోసం మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వారితో అదేవిధంగా Yuwaah మరియు UNICEF వారితో collaborate కావడం జరిగింది
  • 2023-2024 ATL MARATHON అనేది భారతదేశ యొక్క 75వ గణతంత్ర దినోత్సవం యొక్క నేపథ్యంలో రూపొందించబడింది 
  • ఈ MARATHON లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొని అంతరిక్షం, వ్యవసాయం,విద్య, వైద్యం వంటి రంగాల్లో ఉన్నటువంటి సమస్యలకు వినూత్నమైనటువంటి రీతిలో పరిష్కార మార్గాలను చూపెట్టడం దీని యొక్క లక్ష్యం
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

భారత్ - నేపాల్ సైనిక సమావేశాలు
  • నేపాల్ మరియు భారత సైనిక దళాల మధ్య ప్రతి ఏటా మూడు రోజులపాటు ఒక సమావేశం నిర్వహించబడడం అనేది జరుగుతుంది
  • ఈ ద్వైపాక్షిక సమావేశంలో భారత్ నుంచి సహస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ అయిన రష్మీ శుక్లా  అదేవిధంగా 
  • నేపాల్ తరుపున సాయుధ పోలీస్ దళం ఇన్స్పెక్టర్ జనరల్ అయిన రాజు ఆర్యాల్ వీరిరువురు పాల్గొననున్నారు
  • ఈ యొక్క సమావేశం ఢిల్లీలో జరగనున్నది 
  • ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య రహస్య సమాచార మార్పిడి 
  • అలాగే సరిహద్దు ప్రాంతాల్లో జరిగే నేరాల కట్టడి వంటి తదితరాంశాలకు సంబంధించిన విషయాల పైన ఇక్కడ చర్చించనున్నారు
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

BSF కి సంబంధించి విన్నుత్న ప్రయోగం
  • బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి నేరాలను తగ్గించడం కోసం BSF తేనెటీగల పెంపకానికి సంబంధించి ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది
  • ఈ తేనెటీగల పెంపకం ద్వారా స్మగ్లీంగ్ మరియు ఇతర నేరాలకు కళ్లెం వెయ్య వచ్చు 
  • వీటిని ఒక అస్త్రంగా వినియోగించవచ్చని అధికారులు భావిస్తున్నారు
  • స్థానికంగా ఉన్నటువంటి వారికీ జీవనోపాధిని కల్పించేటువంటి అవకాశం కూడా ఉంది 
  • ఈ కార్యక్రమాన్ని బిఎస్ఎఫ్ వారు పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో చేపట్టారు 
  • ఈ యొక్క కార్యక్రమానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు తోడ్పాటు అందిస్తున్నారు
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

డోక్లాం పై కన్నేసిన డ్రాగన్

  • భారత్, భూటాన్ ల మధ్య ఎప్పటినుంచో మనకు సన్నిహిత సంబంధాలు బలంగా ఉన్నాయి 
  • ఈ రెండు దేశాల మధ్య 1949 సంవత్సరంలో స్నేహ పూర్వక మరియు సహకార ఒప్పందానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది  
  • ఈ ఒప్పందం ప్రకారం :-
  • భారత్ భూటాన్ యొక్క సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తూ ఉండాలి
  • ఆ దేశ విదేశాంగ విధానానికి భారతదేశం మార్గదర్శకత్వం వహిస్తూ ఉండాలి. 
  • అది మాత్రమే కాదు ఉమ్మడి భద్రతకు సంబంధించి భరోసాన కల్పించాలి 
  • ఈ ఒప్పందం ప్రకారమే భారత్ సైన్యం భూటాన్ లో స్థావరాలు ఏర్పరచుకుంది 
  • చైనా-భూటాన్ సరిహద్దు ప్రాంతాల్లో పహారాను కాస్తుంది
  • భారత సరిహద్దు రహదారుల నిర్మాణ సంస్థ భూటాన్ లో పలు మౌలిక వసతులను కూడా నిర్మించింది 
  • భూటాన్ సైనికులకు భారత సైన్యం శిక్షణను కూడా అందిస్తుంది
  • నాటి ప్రధానిగా ఉన్న జవహర్ లాల్ నెహ్రూ గారు భూటాన్ పై దాడిని భారత్ పై దాడిగానే పరిగణిస్తామని 1958 లో నెహ్రూ గారు పార్లమెంటులో ప్రకటించడం కూడా జరిగింది
  • నెహ్రూ గారు పార్లమెంట్లో ఈ ప్రకటన ప్రకటించడాని కంటే ముందే చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది
  • చైనా యొక్క వర్షన్ 
  • చైనా టిబేట్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడమే కాదు లడక్ నేపాల్ సిక్కిం భూటాన్ అరుణాచల్ ప్రదేశ్ ఇవన్నీ కూడా టిబేట్ ప్రాంతానికి సంబంధించి చేతికి అయిదు వేళ్ళు గా ప్రకటించింది
  • భూటాన్ లోని డోక్లాంతో సహా మొత్తం 764 చదరపు కిలోమీటర్ల భూభాగం తనదేనని డ్రాగన్ దబాయిస్తుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

జికా వైరస్
  • ఇటీవల కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ గ్రామం నుండి సేకరించిన దోమల నమూనాలో జికా వైరస్ ను గుర్తించడంతోని ఈ అంశం వార్తల్లో నిలిచింది
  • ఈ జికా వైరస్ కి సంబందించి పుట్టు పూర్వోత్తరాలు:- 
  • ఈ వైరస్ దోమల ద్వారా సంక్రమించే ఒక ఫ్లేవీ వైరస్. 
  • ఇది ప్రధానంగా ఏడేస్ దోమల ద్వారా వ్యాపిస్తుంది 
  • ఈజిప్టు జాతికి చెందిన ఈడిస్ దోమల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని గుర్తించాలి 
  • ఈ వైరస్ అనేది మొదట ఉగండాలోని జీకా అడవిలో 1947 లో కోతుల్లో కనుగొనబడింది
  • మనిషికి సంబంధించినంత వరకు 1952లో ఉగండా మరియు టాంజానియాలో ఈ కేసులు నమోదయ్యాయి
  • దీని యొక్క లక్షణాలు 
  • జ్వరం 
  • కీళ్ల నొప్పులు 
  • కండరాల నొప్పులు 
  • తలనొప్పి అనేది రెండు నుంచి ఏడు రోజులపాటు ఉంటుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా హిరాలాల్  సామారియా

  • తెలంగాణ క్యాడర్ కు చెందిన మాజీ IAS అధికారి అయిన హిరాలాల్ సామారియా కేంద్ర ముఖ్య సమాచార కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు 
  • వీరి నేపథ్యం :- 
  • హిరాలాల్ సామరియా 1960 సెప్టెంబర్ 14న రాజస్థాన్లో జన్మించారు 
  • బ్యాచిలర్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లో సివిల్స్ పట్టాను సాధించారు 
  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణలో వివిధ హోదాల్లో పని చేశారు 
  • అలాగే కొన్నాళ్లు కేంద్ర క్యాడర్ గా పనిచేసి పదవి విరమణ చేయడం జరిగింది
  • ప్రస్తుతం సమాచార హోదాలో బాధ్యతలు కొనసాగిస్తున్న ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఈ పదోన్నతిని కల్పించింది 
  • సోమవారం ఉదయం రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ముగారు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు 
  • ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్ ఖడ్ గారు వీరు ఇరువురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది 
  • ఈ నియామకం చేయడానికి గల కారణం :-
  • సమాచార కమిషన్ లో ఖాళీలపై దాఖలైన ప్రజాప్రయోజనాల వ్వాజ్యం ఇటీవీల సుప్రీంకోర్టులో విచారణకు రాగా సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రుచుడ్ ధర్మాసనాన్నినిర్దేశించడం జరిగింది అలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ నియామకం చేపట్టింది
  • ముఖ్య సమాచార కమిషనర్ నియామకంతో పాటు ఇద్దరు కేంద్ర సమాచార కమిషనర్ల నియామకం చేపట్టి౦ది
  • వీరిలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ CMD గా పనిచేసిన ఆనంది రామలింగం 
  • అలాగే హిమాచల్ అటవీ శాఖ హెడ్ ఆఫ్ ఫోర్స్ కం ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ గా పనిచేసిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి వినోద్ కుమార్ తివారి 
  • వీరి ఇరువురిని కూడా కేంద్ర సమాచార కమిషనర్ గా నియామకం చేపట్టడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

కేంద్ర విద్యుత్ శాఖకు సంబంధించి అదనపు కార్యదర్శి
  • ఆంధ్రప్రదేశ్ క్యాడర్ IAS అధికారి అయిన శ్రీకాంత్ నాగులపల్లి కేంద్ర విద్యుత్ శాఖ అదనపు కార్యదర్శిగా నియమితులు కావడం జరిగింది
  • ప్రస్తుతం క్యాబినెట్ సెక్రటరీ సంయుక్త కార్యదర్శి హోదాలో ఉన్న ఆయనను అదనపు కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది 
  • వారితో పాటు 21 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ వివిధ శాఖలకు బదిలీ చేసింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

ఈనెల నవంబర్ 13 నుంచి ఢిల్లీలో సరి బేసి విధానం

  • ఢిల్లీలో ఆందోళన స్థాయిలో పెరిగిపోయిన కాలుష్యం యొక్క నియంత్రణకు ఈనెల 13 నుంచి వాహనాలకు సరి బేసి అంకెల విధానాన్ని అమలు చేయాలి అని నిర్ణయించారు 
  • వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్ యొక్క చివరణ 
  • సరి సంఖ్య ఉన్న వాహనాలకు ఒకరోజు 
  • బేసి సంఖ్య ఉన్న వాహనాలకు మరో రోజున రోడ్లపైకి అనుమతించేటటువంటి విధానాన్ని సరి బేసి విధానంగా పేర్కొంటాము
  • ఈ విషయాన్ని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి అయిన గోపాల్ రాయ్ సోమవారం విలేకరులకు వెల్లడించారు 
  • దానికి గల ప్రధాన కారణం
  • ప్రభుత్వం పేర్కొన్న రక్షణ స్థాయిలకు కంటే ఈ కాలుష్యం అనేది ఏడెనిమిది రేట్లు పెరగటంతోని ఈ విధానాన్ని అవలంబిస్తున్నామని ఆయన పేర్కొనడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 Elon Musk కి సంబంధించి కొత్త చాట్ బాట్

  •  డ్రైవర్ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష అంతర్జాలం వంటి ఎన్నో ప్రయోగాలకు పెట్టింది పేరు ఈ Elon Musk
  •  అటువంటి Elon Musk ఇప్పుడు కృతిమ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు
  •  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI గా ప్రస్తావిస్తాం
  •  ఆయన కంపెనీ వచ్చేసి X AI
  •  ఈ కంపెనీ మొట్టమొదటిసారిగా AI నమునాను పరిచయం చేసింది
  •  దాని పేరు వచ్చేసి గ్రాక్ అని చెప్పి చెప్తాము
  •  ఈ గ్రాక్ అనేది ఒక చాట్ బాట్
  •  చాట్ బాట్ అంటే అర్థం మనుషులతో సంభాషణ అనుకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని చాట్ బాట్ గా పేర్కొంటాము
  • ఈ చాట్ బాట్ గురించి Elon Musk తన యొక్క సామాజిక మాధ్యమైనా X ద్వారా అనగా ట్విట్టర్ ద్వారా ఈ చాట్ బాట్ గురించి వెల్లడించడం జరిగింది
  •  ఈ చాట్ బాట్ అనేది ఓపెన్ ఏఐకి చెందిన జిపిటి కి, గూగుల్ కు చెందిన పామ్ కి ప్రత్యామ్నాయం కలిగిన ఓ పెద్ద లాంగ్వేజ్ మోడల్ అని గుర్తించాలి
  •  చాట్ జిపిటి , పామ్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది
  • 1) ఈ గ్రాక్ అనేది ఎక్స్ లో మాత్రమే పనిచేస్తుంది
  • 2) ఎక్స్ ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

ఆదిత్య - L1

  •  సూర్యుడు పై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము
  •  ఆ సూర్యయాన్ పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగాన్ని ఆదిత్య - L1 గా పేర్కొంటాము
  •  Polar Satellite Launching Vehicle c-57 వాహన నౌక ద్వారా 1475 కిలోల బరువు కలిగిన భారత తొలి అంతరిక్ష ఆధారిత సౌర పరిశీలన ఉపగ్రహం ఆదిత్య - L1 నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
  •  2023 సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం జరిగింది
  •  శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక అయినా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV c57 వాహన నౌకా సహాయంతో ఆదిత్య - L1 అనే ఉపగ్రహాన్ని ఇక్కడి నుంచి ప్రయోగించారు
  •  దీని యొక్క లక్ష్యం
  •  భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజ్ బిందువు 1 (L1-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు
  •  ప్రవేశపెట్టి గ్రహణాలతో సంబంధం లేకుండా సౌర గోళం పై నిరంతరం అధ్యయనం చేస్తారు
  •  ముఖ్యంగా సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించడం దీని యొక్క లక్ష్యం
  •  ఆదిత్య L1 ఉపగ్రహాం యొక్క ప్రత్యేకతలు
  •  ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1475 కేజీలు
  • 1) సూర్యుడికి ఉన్న మరో పేరు ఆదిత్య
  • 2) ఈ ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ అనే బిందువు వద్ద ప్రవేశ పెట్టాలి అనుకున్నారు కాబట్టి Lఅని,
  • 3) ఇది సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహము కావున 1 అని
  •  ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రొఫెసర్ యు ఆర్ రావు స్పేస్ సెంటర్లో URSC ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు
  • URSC సెంటర్లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఆదిత్య L1 ఉపగ్రహానికి రూపకల్పన చేయడం జరిగింది
  •  సౌర జ్వాలలను క్లిక్ మనిపించిన ఆదిత్య L1 ఉపగ్రహం
  •  సూర్యుడు పై లోతైన పరిశోధన కోసం భారత్ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము అందులో భాగంగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది
  •  ఈ ఆదిత్య L1 ఉపగ్రహాం సౌర జ్వాలలకు సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చిత్రాన్ని చిత్రాలను తీయగలిగింది
  •  సౌర జ్వాలలు అంటే సౌర వాతావరణం ఆకస్మాత్తుగా ప్రకాశవంతం కావడాన్ని సౌర జ్వాలగా పేర్కొంటాం
  •  ఆ సౌర జ్వాలలకు సంబంధించిన చిత్రాలను ఇప్పుడు ఆదిత్య L1 తీయడం జరిగింది
  •  HEL1OS అనే పరికరం సహాయంతో ఈ చిత్రాలను తీయగలిగింది
  •  సూర్యుడికి సంబంధించిన హై ఎనర్జీ ఎక్స్రే చర్యలను పరిశీలించి అధిక రిజల్యూషన్ లో ఈ చిత్రాలు మనకు అందిస్తుంది
  •  సూర్యుడిలోని విస్పోటక శక్తి ఎలక్ట్రాన్ త్వరణం ఇలాంటి మరిన్ని వివరాలను ఈ యొక్క పరికరం నుంచి మనం పొందడానికి అవకాశం ఉంటుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 ప్రళయ్ క్షిపణి

  •  ఉపరితలం నుంచి ఉపరితలం పైనున్న లక్ష్యాలను చేదించగల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రళయ్ క్షిపణి గా ప్రస్తావిస్తాం
  •  ఈ ప్రళయ్ క్షిపణి ని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది
  •  ఒడిశా తీరానికి చేరువలో ఉన్న అబ్దుల్ కలాం దీవి నుంచి ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించడం అనేటువంటిది జరిగింది
  • ఈ ప్రయోగంలో క్షిపణి యొక్క గమనాన్ని తీరం వెంబడి ఉన్న టాకింగ్ పరికరాలు పూర్తిస్థాయిలో నిశితంగా పరిశీలించడం జరిగింది
  •  ఈ ప్రళయ్ క్షిపణి యొక్క ప్రత్యేకతలు 
  •  ఈ క్షిపణి 300 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది
  •  అది మాత్రమే కాదు ఈ క్షిపణి 500 - 1000 కిలోల పేలోడ్ ను మోసుకెళ్ళగలుగుతుంది
  •  ఇది ఘన ఇంధనంతో పనిచేస్తుంది
  •  ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రయోగిస్తున్న ఇస్కాండర్ క్షిపణి తరహాలోనే ఇది కూడా పనిచేస్తుంది
  •  దీనిని చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించడం కోసం ప్రత్యేకంగా రూపొందించారు
  •  DRDO వారు రూపొందించారు
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 పంట వ్యర్ధాల దహనానికి సంబంధించిన అంశం

  •  దేశ రాజధాని ఢిల్లీ లో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ హర్యానా ఉత్తర్ ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాలకు పంట వ్యర్ధాలను తగలబెట్టడాన్ని తక్షణమే నిలిపివేయామని సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది
  •  జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుదాన్షు దునియాల ధర్మాసనం ఈ ఆదేశాలను ఇవ్వడం జరిగింది
  •  కాలుష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడాన్ని చూస్తూ ఊరుకోలేమని ఇది పూర్తిగా ప్రజల ఆరోగ్యాన్ని హతమార్చడమే ఇంతకు మించిన పదబంధం నా వద్ద లేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది
  •  కాలుష్యానికి తాము భాద్యులం కాదంటూ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చెబుతుండడంపై ఆయన స్పందిస్తూ రాజకీయ వైరం అన్నివేళలా తగదని ఢిల్లీ లో వాయు నాణ్యత పడిపోవడానికి సంబంధించిన సమస్యకు పూర్తిగా అడ్డుకట్ట పడాల్సిందేనని అది ఎలా చేస్తారో మాకు అనవసరంకానీ వ్యర్థాలను కాల్చడం మాత్రం ఆగి పొవాలి
  •  దానికి నిర్బంధ చర్యలే తీసుకుంటారో, ప్రోత్సాహకాలే ఇస్తారో, ఇతరత్రా చర్యలే చేపడుతారు అది మీ ఇష్టం వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 కృత్రిమ వర్షాలతో వాయు కాలుష్యానికి చెక్

  •  వాటికి పరిష్కారంగా ఐఐటి కాన్పూర్ విద్యార్థులు ఒక పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు
  •  కృత్రిమ వర్షాల ద్వారా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని వారు ఈ ప్రయోగం ద్వారా తెలియపరచడం జరిగింది
  •  ఈ కృతిమ వర్షాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి ఐఐటి కాన్పూర్ విద్యార్థులకు దాదాపు 5 ఏళ్ల సమయం పడింది
  •  ఈ ప్రయోగంలో ఒక ప్రత్యేకమైన విమానం ద్వారా రసాయానాలను మేఘాలలో చల్లి సంబంధిత ప్రాంతంలో వర్షాలు కురిపించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది
  •  తద్వారా కాలుష్యాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది
  •  అమెరికా, చైనా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వంటి దేశాల్లో సహజంగానే నీటి కొరత ఏర్పడుతుంది
  •  అలా నీటి కొరత ఏర్పడినప్పుడు వారందరూ కూడా ఈ పద్ధతిని పాటించడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించాలి
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

అణ్వస్త్ర ఆందోళనలు

  •  మగ్ర అణు పరీక్షల నిషేధ ఒప్పంద నుంచి రష్యా బయటికి రావడం
  •  ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర ఆందోళనలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు
  •  దీనినే ఇంగ్లీషులో Comprehensive Nuclear Test Ban Treaty గా పేర్కొంటాం
  •  ఈ ఒప్పందం 1996వ సంవత్సరంలో జరిగింది 
  •  ఈ ఒప్పందంపై 187 దేశాలు సంతకాలు చేశాయి
  •  178 దేశాలు మాత్రమే ఈ ఒప్పందాన్ని సజావుగా అమలు చేయాలని నిర్ణయించాయి
  •  భారత్ మరియు పాకిస్తాన్ తో పాటు మిగిలిన 9 దేశాలు ఈ CTBT పై సంతకాలు చేయలేదు
  •  ఏ ఒప్పందాని కైనా రెండు పద్ధతులు ఉంటాయి
  • 1) సిగ్నేచర్
  • 2) రాటిఫికేషన్
  •  సిగ్నేచర్ అంటే :- ఒక దేశం యొక్క ప్రతినిధి అంతర్జాతీయంగా ఆ ఒప్పందానికి సంబంధించి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకోవడం
  •  రాటిఫికేషన్ :- ఏ దేశమైతే ఆ ఒప్పందం మీద సంతకం చేస్తుందో ఆ దేశం యొక్క పార్లమెంట్లో ఆ దేశం ఆ ఒప్పందం ప్రకారం దేశీయంగా చట్టాలు చేయడం జరుగుతుంది
  •  ఈ CTBT ఒప్పందంపై 187 దేశాలు సిగ్నేచర్ చేస్తే
  •  178  సిగ్నేచర్ + రాటిఫికేషన్ చేయడం జరిగింది
  •  ఇందులో భారత్, పాకిస్తాన్ , నార్త్ కొరియా సిగ్నేచర్ రాటిఫికేషన్ ఈ రెండు చేయలేదు
  •  అమెరికా సిగ్నేచర్ చేస్తే రాటిఫికేషన్ చేయలేదు
  •  రష్యా మాత్రం సిగ్నేచర్ + రాటిఫికేషన్ రెండు చేసింది
  •  ప్రస్తుతం రష్యా ఈ రాటిఫికేషన్ సంబంధించిన అంశాన్ని డి రేటిఫికేషన్ చేసుకుంది
  •  దానికి గల కారణం
  •  ఈ CTBT కి సంబంధించిన అంశం పైన అమెరికా రాటిఫికేషన్ చేసుకోకపోవడం 
  •  Ratify చేసుకున్న రష్యా కూడా డి రాటిఫై చేసుకొని అమెరికా సరసన నిలిచింది 
  •  భారత్ విషయానికి వచ్చినట్లయితే
  •  భారత్ రాటిఫికేషన్ చేయలేదు అలా అని సైన్ కూడా చేయలేదు
  •  దానికి గల కారణం
  •  అన్వస్త్ర పరీక్షలతోపాటు, అన్వాయిదాలు లేని ప్రపంచాన్ని ఆవిష్కరించాలని భారత్ దీర్ఘ కాలంగా ఎదురుచూస్తుంది =} డిమాండ్ కూడా చేస్తుంది
  •  1954 వ సంవత్సరంలో అమెరికా క్రేజీల్ బ్రావో పేరుతో అణు పరీక్షలు నిర్వహించింది
  •  ఆ పేలుడుకి సంబంధించిన తీవ్రత అనేది హిరోషిమా కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉండటం జరిగింది
  •  ఎప్పుడైతే దాని తీవ్రత 100 రెట్ల కంటే అధికంగా ఉందని తెలిసిందో ఒక్కసారిగా అంతర్జాతీయ సమాజం భయంతో వణికిపోయింది
  •  ఈ పరీక్షల కారణంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దీవుల్లో ఉన్న సముద్ర జలాలపై కొన్ని ఏళ్ల పాటు రేడియేషన్ కీ దారితీసింది
  •  అమెరికా ఈ అణు పరీక్షలు చేసిన తర్వాత ప్రధానిగా ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ అమెరికా చేసిన ఈ అణు పరీక్షలను తీవ్రంగా వ్యతిరేకించాడు
  •  అన్వాస్త్రాలను కలిగిన దేశాలు అవి లేని వాటిపై ఆధిపత్యం చెలాయించే ప్రమాదం ఉందని వాదించడం కూడా జరిగింది
  •  కాకపోతే 1964 సంవత్సరంలో ఎప్పుడైతే చైనా అణు పరీక్షలు నిర్వహించిందో పొరుగునున్నటువంటి దేశంతో ప్రమాదం ఉందని భావించిన భారత్ ఈ సిటీబీటీ పైన సంతకం చేయడానికి నిరాకరించింది
  •  భారత్ ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే అణు పరీక్షలను నిర్వహించింది
  •  మొదటగా 1974 సంవత్సరం పోఖ్రన్ కేంద్రంగా మొదటిసారి అణు పరీక్షలు నిర్వహిస్తే
  •  రెండోసారి 1998వ సంవత్సరం లో చైనా సాయంతో పాకిస్తాన్ అన్వాయిదాలు సమకూర్చుకొనుందన్నా నిఘా వర్గాల సమాచారంతో
  •  1998 సంవత్సరంలో భారత్ రెండోసారి అణు పరీక్షలు నిర్వహించడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

వందే సాధారణ్ రైల్

  •  ఏసీ అవసరంలేని ప్రయాణికుల కోసం కొత్తగా ప్రవేశపెట్టబోయే రైళ్లను వందే సాధారణ్ రైళ్లు గా పేర్కొంటాం
  •  తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు
  •  అత్యంత ప్రాచుర్యం పొందిన వందే భారత రైళ్ల తరహాలోనే వీటిని కూడా రూపొందించారు
  • కానీ వందే భారత్ రైలుకు ఉండే అత్యున్నతమైన వసతులు ఈ రైలుకు ఉండవని గ్రహించాలిఅంటే అర్థం ఏసీ సౌకర్యంగాని , ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యే  Doors గాని ఇలాంటి వసతులు ఉండవని అభ్యర్థులు గమనించాలి
  •  ఈ వందే సాధారణ్ రైళ్లు యొక్క ప్రత్యేకతలు
  •  ఈ రైల్లో 12 స్లీపర్ కోచ్లు 8 అన్ రిజర్వ్ డ్  బోగీలు ఉన్నాయి
  •  ఈ సాధారణ రైల్లో రెండు చివరల ఇంజన్ను కలిగి ఉంటాయి ఆ రెండు ఇంజిన్ లను సిగ్నలింగ్, ట్రాక్ ల వీలుని బట్టి వినియోగిస్తారు
  •  ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి భోగిలో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు
  •  భోగి లోపల అదునాతనమైన సాంకేతికతతో  కూడుకున్న వసతులు ఏర్పాటు చేయబడ్డాయి
  •  గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఈ వందే సాధారణ్ రైళ్లు ప్రయాణం చేస్తాయి
  •  ఒకేసారి 1834 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యాన్ని కూడా ఇవి కలిగి ఉన్నాయి
  •  మొదటి దశలో ఐదు మార్గాల్లో ఈ సాధారణ రైళ్ళను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధం చేస్తుంది ఏంటా 5 మార్గాలు అంటే
  •  ముంబై - ఢిల్లీ
  •  పాట్నా- ఢిల్లీ
  •  హవ్ డా - ఢిల్లీ
  •  హైదరాబాద్ - ఢిల్లీ
  •  ఎర్నాకులం - గువాహాటి
  •  మరో 30 మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ అడుగులు వేస్తుంది
  •  తొలుత ఈ రైళ్లను ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించిందని చెప్పుకుందాం కదా
  •  అందులో భాగంగానే ముంబై నుంచి అహ్మదాబాద్ మద్య ఈ వందే సాధారణ్ రైల్ యొక్క ట్రయల్ రన్ అనేది విజయవంతం కావడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

భారత్ నుంచే అత్యధిక యూనివర్సిటీలు
  •  ఆసియా దేశాల్లోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్టాత్మక క్వాకరెల్లి సైమండ్స్(QS) అనే సంస్థ 2024 ఏడాదికి గాను బుధవారం ర్యాంకులను విడుదల చేసింది
  •  ఈ ర్యాంకుల్లో మన దేశం నుంచి ప్రఖ్యాతి  విశ్వవిద్యాలయాలైన
  •  ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ తొలి 50 స్థానాల్లో నిలిచాయి
  •  ఐఐటి బాంబే 40వ స్థానాన్ని సంపాదిస్తే
  •  ఐఐటి ఢిల్లీ 46వ స్థానంలో చోటు సంపాదించుకుంది
  •  ఈ యొక్క నివేదికను రూపొందించడం కోసం ప్రముఖ క్యూఎస్ (QS) అనే సంస్థ దాదాపుగా ఆసియా కాంటినెంట్ లో ఉన్న 856 యూనివర్సిటీలను పరిశీలించడం జరిగింది
  •  ఈ యొక్క జాబితాలో
  •  భారత్ నుంచి అత్యధికంగా 148 విశ్వవిద్యాలయాలు చోటు సంపాదించుకుంటే
  •  చైనా నుంచి 133 విశ్వవిద్యాలయాలు
  •  జపాన్ నుంచి 96 విశ్వవిద్యాలయాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది
  •  ఇక మయన్మార్, కాంబోడియా, నేపాల్ ఈ జాబితాలో తొలిసారిగా మెరిసాయి
  •  గతేడాది ఇదే నివేదికలో భారత్ నుంచి 111 యూనివర్సిటీలు ఎంపిక అయితే ఈ ఏడాది ఆ సంఖ్య అనేది 148 చేరింది ఈ విషయాన్ని గమనించాలి
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

UK , లాఫింగ్ గ్యాస్ కి సంబంధించిన అంశం
  •  నైట్రస్ ఆక్సైడ్ ను మనం లాఫింగ్ గ్యాస్ గా పిలుచుకుంటాము
  •  వినోద భరిత కార్యకలాపాల కోసం వినియోగించడాన్ని బ్రిటన్ ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది
  •  దానికి గల కారణం
  •  ఈ నైట్రస్ ఆక్సైడ్ అనే డ్రగ్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల రక్తహీనతన బారిన పడేటువంటి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
  •  దీన్ని యొక్క తీవ్రత గనక ఎక్కువైతే నరాలు దెబ్బతినడంతో పాటు పక్షవాతం వచ్చేటటువంటి ప్రమాదం ఉందని కూడా వారు పేర్కొనడం జరిగింది
  •  బ్రిటన్ లోని 16 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారే ఈ డ్రగ్ను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది
  •  వారందరి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ ప్రభుత్వం నైట్రస్ ఆక్సైడ్ ను నిషేధించింది 
  •  మినహాయింపు ఇచ్చిన అంశాలు
  •  హెల్త్ సెక్టార్
  •  కొన్ని పరిశ్రమలకు చట్టబద్ధంగా వినియోగిస్తున్నటువంటి వాటికి మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది 
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవం
  •  ప్రతి ఏటా నవంబర్ 9న ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహిస్తాము
  •  దానికి గల కారణం
  •  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది వేరుపడింది అనగా కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేయబడింది
  •  2000 సంవత్సరం నవంబర్ 9న ఉత్తరప్రదేశ్ నుంచి వేరుపడి భారతదేశంలో 27వ రాష్ట్రంగా అవతరించింది
  •  తొలినాళ్లల్లో ఉత్తరాంచల్ పేరుతో ఏర్పాటు కావడం జరిగింది
  •  ఈ 2007వ సంవత్సరంలో ఆ ఉత్తరాంచల్ పేరుని ఉత్తరాఖండ్ గా మార్చారు
  •  ఉత్తరాఖండ్ అనేటువంటి పదం సంస్కృత మాండలికం నుంచి వచ్చింది
  •  ఉత్తరాఖండ్ అంటే అర్థం ఉత్తర నగరం
  •  ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు
  •  ప్రకృతి సౌందర్యానికి, సాంస్కృతిక వైవిధ్యానికి, మతపరమైన ప్రాముఖ్యతకు పెట్టింది పేరు
  •  చార్ధామ్ , బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి మరియు యమునోత్రి నాలుగు పవిత్ర హిందూ పుణ్యక్షేత్యాలకు నిలయంగా ఈ ప్రాంతం నిలిచింది
  •  యునెస్కో వారు గుర్తించిన ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించి ఉత్తరాఖండ్ నుంచి రెండు ప్రదేశాలు దీంట్లో చోటు సంపాదించుకున్నాయి
  •  వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్
  •  నందాదేవి నేషనల్ పార్క్
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

  పర్యావరణ ఆస్కార్ (ఎకో ఆస్కార్లు)

  •  ఈ పర్యావరణ ఆస్కార్ అవార్డుని Earth Shot బహుమతి అని కూడా పిలుస్తాం
  •  బ్రిటిష్ యువరాజు అయిన ప్రిన్స్ విలియం ఈ అవార్డుని స్థాపించడం జరిగింది
  •  ఈ బహుమతుల యొక్క ప్రధానోత్సవం అనేటువంటిది ప్రతి ఏడాది జరుగుతుంది
  • పర్యావరణపరంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు గాని సవాళ్లు గాని సాంకేతికతతో పరిష్కారం చూపే సంస్థలకు ప్రోత్సాహకం అందించడం కోసం ఈ అవార్డులను అందించడం జరుగుతుంది 
  •  ఈ బహుమతులు గెలిచినటువంటి గ్రహీతలకు 10 లక్షల ఫౌండ్లు నగదును అందించడం జరుగుతుంది (10 కోట్ల రూపాయలు)
  •  ఈ ఏడాది ఈ అవార్డును ఐదు సంస్థలు గెలుచుకుంటే
  •  అందులో రెండు సంస్థలు భారత్ చెందిన సంస్థలు ఉండడం విశేషం.
  •  ఏంటా ఆ రెండు సంస్థలు అంటే
  •  1) S4S (సైన్స్ ఫర్ సొసైటీ)
  •  2) భూపుత్ర సంస్థ
  •  భారతదేశంలో ఆహార వృధాను అరికట్టడానికి కృషి చేస్తున్నందుకు S4S సంస్థకు
  •  ప్రపంచవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి పాటుపడుతున్న భూపుత్ర సంస్థ కు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 37వ జాతీయ క్రీడలు 

  • ఈ 37వ జాతీయ క్రీడాలని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు గోవాలోని జవహర్ లాల్ నెహ్రూ యొక్క స్టేడియంలో ఈ క్రీడలను ప్రారంభించడం జరిగింది
  •  ఈ నేషనల్ గేమ్స్ అనేవి ఇండియన్ ఒలంపిక్ గేమ్స్ గా ప్రసిద్ధి గాంచాయి
  •  ఈ యొక్క జాతీయ క్రీడలు అనేవి స్వాతంత్రానికి పూర్వమే ప్రారంభించబడ్డాయి
  •  1924 సంవత్సరంలో లాహార్ కేంద్రంగా మొట్టమొదటిసారిగా జాతీయ క్రీడలు నిర్వహించబడితే,
  •  స్వాతంత్రం అనంతరం 1948 వ సంవత్సరంలో లక్నో కేంద్రంగా 13వ జాతీయ క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి
  •  37 వ జాతీయ క్రీడలనేవి గమనించాలి
  •  దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి రాష్ట్రం గోవా అని గుర్తించాలి
  •  ఈ యొక్క 37వ జాతీయ క్రీడల్ని అక్టోబర్ 25 నుంచి నవంబర్ 9 వరకు ఈ క్రీడలనేవి నిర్వహించడం జరిగింది.
  •  సుమారు 20 రోజులపాటు క్రీడలు అనేవి నిర్వహించబడ్డాయి.
  •  ముగింపు వేడుకకు ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ దన్ ఖడ్ గారు హాజరు కావడం జరిగింది
  •  పథకాల పట్టికలో
  •  మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిస్తే
  •  ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో
  •  తెలంగాణ 22వ స్థానాల్లో నిలిచాయి
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 Global TB Report 2023 
  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న TB కి సంబంధించి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది
  •  TB అంటే ట్యూబర్క్లోసిస్ గా చెప్తాము
  •  దీన్నే తెలుగులో క్షయ వ్యాధి అంటాము
  • ఈ క్షయ వ్యాధి అనేది మైకొ బ్యాక్టీరియం ట్యూబర్ క్యులోసిస్ వల్ల కలిగే ఒక ఇన్ఫెక్షన్ అని గుర్తించాలి
  •  ఇది శరీరంలోని ఏదైనా ఒక అవయవాన్ని ప్రభావితం చేస్తుంది.
  •  దాంట్లో ప్రధానంగా
  •  ఊపితిత్తులు
  •  ఫ్లూరా
  •  శొషరస గ్రంధులు
  •  ప్రేగులు వెన్నెముక
  •  మరి ముఖ్యంగా మెదడు వీటిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది
  •  దీని యొక్క లక్షణాలు
  •  కోరింత దగ్గు
  •  దగ్గుతున్నప్పుడు రక్తం రావడం
  •  ఛాతి నొప్పి
  •  బలహీనం కావడం
  •  బరువు తగ్గడం
  •  రాత్రుల్లో చెమటలు పట్టడం
  •  జ్వరం
  •  ఈ నివేదికను 2023లో విడుదల చేసినప్పటికీ కూడా 2022 నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది అని గుర్తించాలి
  •  ప్రపంచంలోనే అత్యధిక TB కేసులు భారతదేశం లోనే ఉన్నాయని చెప్తుంది
  •  కోవిడ్ 19 తర్వాత ఆ స్థాయిలో మరణాలు అనేవి ఈ ఇన్ఫెక్షన్ ద్వారానే సంభవించాయి అని చెబుతుంది
  •  అలాగే ఈ TB కారణంగా హెచ్ఐవి మరియు ఏడ్స్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ మరణాలు సంభవించాయి అని, ప్రతి సంవత్సరం పది మిలియన్లకు పైగా ప్రజలు TBతో అనారోగ్యం బారిన పడుతున్నారు అని ఈ నివేదిక చెప్తుంది
  •  ప్రపంచవ్యాప్తంగా 100% కేసులు నమోదయితే అందులో87% TB కేసులనేవి ఈ 30 అధిక భారం ఉన్నటువంటి దేశాల నుండే నమోదు కావడం జరుగుతుంది
  • ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పిన్స్, పాకిస్తాన్, నైజీరియా, బంగ్లాదేశ్, మరియు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మొదలగు దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా 87% TB కేసులు అనేవి ఇక్కడి నుంచే నమోదు కావడం అనేది జరుగుతుంది
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

 సుప్రీంకోర్టులో నూతన జడ్జీలు
  •  సుప్రీంకోర్టులో నూతన జడ్జిలకు సంబంధించి ప్రమాణస్వీకారం అనేది జరిగింది.
  •  జస్టిస్ సచిస్ చంద్రశర్మ
  •  జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్
  •  జస్టిస్ సందీప్ మెహతాలు
  •  వీరు ముగ్గురు కూడా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసారు
  •  ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రశర్మ పనిచేస్తే
  •  రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ పనిచేసారు
  •  గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సందీప్ మెహతా బాధ్యతలు నిర్వర్తించారు
  •  ఈ ముగ్గురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిజెఐ జస్టిస్ డివై చంద్రచుడ్ నేతృత్వంలోని కొలిజం ఈనెల ఆరో తేదీన సిఫార్సు చేసింది
  •  So చంద్రచుడ్ నేతృత్వంలోని కొలిజం సిఫార్సు చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని పరిశీలించి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి వీరి నియామకానికి సంబంధించి ఆమోదముద్ర వేయడం జరిగింది
  •  ఈ ముగ్గురు న్యాయమూర్తుల నియమకంతో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య 34 చేరడం జరిగింది ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి
15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK

బేరియం ఉన్న బాణాసంచా పై నిషేధం
  •  బేరియం కలిసి ఉన్న సాంప్రదాయ రకాల బాణాసంచాను కాల్చడానికి సంబంధించి మనకు గతంలోని ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయబడ్డాయి
  •  2018 వ సంవత్సరంలో ఈ ఉత్తర్వులు జారీ చేయబడడం అనేటువంటిది జరిగింది
  •  ఈ ఉత్తర్వులు అప్పుడు కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమయ్యాయి కానీ తాజాగా ఈ యొక్క ఉత్తర్వులు అనేటువంటి అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేయడం జరిగింది
  •  బాణాసంచా దుష్ప్రభావాల గురించి సామాన్య ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కీలకం
  •  ప్రస్తుత రోజుల్లో పిల్లల కంటే పెద్దవారే బాణాసంచా కాలుస్తుండడం విచారకరం
  •  కాలుష్యం పర్యావరణ పరిరక్షణ అనేవి న్యాయస్థానాలు చూసుకోవలసిన విధి అనేది తప్పుడు భావన
  •  వాయు ,ధ్వని కాలుష్యం విషయాలకు అడ్డుకట్ట వేయడం ప్రతి ఒక్క కర్తవ్యం అని జస్టిస్ గోపన్న జస్టిస్ సుందరేశ్ ల ధర్మాసనం మంగళవారం ఈ అంశాల గురించి పేర్కొనడం జరిగింది

15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK


ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.


Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

15/11/2023 PDF File :-  LINK
11/11/2023 PDF File :-  LINK







Comments