Daily Current Affairs In Telugu || 27 November 2023 || By Notifications Academy

 ఆదిత్య - L1

  •  సూర్యుడు పై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము
  •  ఆ సూర్యయాన్ పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగాన్ని ఆదిత్య - L1 గా పేర్కొంటాము
  •  ఈ ఆదిత్య - L1 ఉపగ్రహాన్నిPSLV c-57 వాహన నౌక ద్వారా 1475 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 2023 సెప్టెంబర్ 2న నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం అనేది జరిగింది
  •  శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక అయిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు
  •  దీని యొక్క లక్ష్యం
  •  ముందుగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ బిందువు 1 (L1-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు
  •  వీటి దూరం :- భూమి నుంచి ఈ కక్ష్య కి 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది
  • ఈ కక్ష్యలో ప్రవేశపెట్టి సౌర గోళం పై నిరంతరం అధ్యయనం చేస్తారు
  •  ముఖ్యంగా సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు
  •  ఆదిత్య L1 ఉపగ్రహాం యొక్క ప్రత్యేకతలు
  •  ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1475 కేజీలు
  •  1) సూర్యుడికి ఉన్న మరో పేరు ఆదిత్య
  •  2) ఈ ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ అనే బిందువు వద్ద ప్రవేశ పెట్టాలి అనుకున్నారు కాబట్టి  Lఅని,
  •  3) ఇది సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహము కావున 1 అని అలా ఈ ఉపగ్రహానికి ఆదిత్య L1 అని నామకరణం చేయడం జరిగింది
  •  ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రొఫెసర్ యు ఆర్ రావు స్పేస్ సెంటర్లో (URSC) ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు
  • URSC లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఆదిత్య L1 ఉపగ్రహానికి రూపకల్పన చేసారు
  •  సూర్యుడు పై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ప్రయోగాన్ని ఆదిత్య L1 అంటాము
  •  ఆ ఆదిత్య L1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది,
  •  లాంగ్వేజ్ బిందువు L1 వద్ద ప్రవేశపెట్టాలనుకున్న ఈ ఉపగ్రహం వచ్చే ఏడాది జనవరి 07 నాటికి చేరుకుంటుంది
  •  ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ అయినా సోమనాథ్ గారు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలియజేసారు
05/12/2023 PDF File  :- LINK
TODAY PDF File  :-  LINK
(16 To 25) Nov 2023 Weekly PDF File :-  LINK

 డెంగ్యూ వ్యాధి
  •  వాతావరణ మార్పులతో డెంగ్యూ విజృంభణ అనేది జరుగుతుంది
  •  దేశంలో వచ్చినటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ యొక్క వ్యాధి అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించింది
  •  ఈశాన్య రాష్ట్రాల వారికి కొన్నేళ్ల క్రితం వరకు ఈ వ్యాధి గురించి అంతగా తెలియదు
  •  కానీ వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు అనగా వర్షాపాతం, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఇవన్నీ కూడా వైరస్ వ్యాప్తికి , కొత్త వేరియంట్లు రావడానికి కారణమైంది
  •  దేశంలో ఒక ఏడాదిలో ఈ వ్యాధి వ్యాప్తి అనేది 5 - 6 నెలలకు పెరిగింది 
  •  ఇక డెంగ్యూకు సంబంధించి కొన్నిముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే
  •  ఈ డెంగ్యూ జెనస్ ఫ్లావీ వైరస్ వల్ల వ్యాపిస్తుంది
  •  ప్రదానంగా ఈడెస్ జాతికి చెందిన ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది
  •  ఈ దోమ చికెన్ గున్యా మరియు జీక ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను కూడా కలుగజేస్తుంది
  •  ఈ వ్యాధి యొక్క లక్షణాలు
  •  అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది
  •  తీవ్రమైన తలనొప్పి
  •  కళ్ళ వెనుక నొప్పి
  •  తీవ్రమైన ఎముకల నొప్పులు
  •  కండరాల నొప్పులు
  •  కీళ్లనొప్పులు
  •  దీని యొక్క వ్యాక్సిన్ =} CYD TDV లేదా Dengvaxia
  •  2019లో US=} Food And Drugs Administration ఈ వ్యాక్సిన్ ని ఆమోదించింది
  •  ఇండోనేషియా దేశం వొలభాకియా బ్యాక్టీరియా కలిగిన దోమల్ని ఉపయోగించి డెంగ్యూ వ్యాధిని నియంత్రిస్తుంది
  • అలా ఉపయోగించి డెంగ్యూ ను నియంత్రిస్తున్న మొట్టమొదటి దేశం కూడా ఇండోనేషియా అనే గుర్తించాలి
05/12/2023 PDF File  :- LINK
TODAY PDF File  :-  LINK
(16 To 25) Nov 2023 Weekly PDF File :-  LINK

 
 ఆఫ్గాన్ శరణార్థులు
  • 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పౌర ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్ లు అధికారాన్ని చేపట్టారు
  •  అనేకమంది ఆఫ్గాన్ వాసులు పలు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు
  •  ఎక్కువ మంది పాకిస్తాన్ కు వలస వెళ్లారు (21.3 లక్షల మంది)
  •  ఆఫ్గాన్ శరణార్థులని నవంబర్ 1 నాటికి దేశం విడిచిపోవాలని పాకిస్తాన్ ఆదేశించింది
  •  అక్కడే ఉన్న వారిపై పాక్ ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది
  •  ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకుంది
  •  పాక్ ను వీడుతున్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు నుంచి ఎగ్జిట్ చార్జీలను వసూలు చేయడం
  •  దాని అర్దం :- పాక్ ను వీడాలి అంటే 830 డాలర్లు (69వేల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది
  •  ఈ 69 వేల రూపాయల మొత్తాన్ని ఒక్కో వ్యక్తిపై వసూలు చేయనున్నారు
  •  పాకిస్తాన్ అవలంబిస్తున్న ఈ విధానాన్నిపలు దేశాలు ఖండిస్తున్నాయి
  •  అయినప్పటికీ ఆ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని ఆ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలియజేసింది
05/12/2023 PDF File  :- LINK
TODAY PDF File  :-  LINK
(16 To 25) Nov 2023 Weekly PDF File :-  LINK


 నిమోనియా
  •  చైనాలో నిమోనియా కేసుల విజృంభన
  •  ఈ కొత్త వైరస్ అనేది కోవిడ్ తరహాలోనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
  •  కేంద్రా ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ICMR, ఆరోగ్య సేవలో డైరెక్టర్ జనరల్ ఈ అంశంపై పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన వివరించారు
  •  కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను బెడ్లు, మందులు, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, టెస్టింగ్ కిట్స్ వీటన్నిటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది
  •  నిమోనియాకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు
  •  ఊపిరితిత్తులకు వచ్చి ప్రాణాలు తీసే వ్యాధుల్లో ఒకటిగా నిమోనియాని చెప్తాము
  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం
  •  అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ నిమోనియా వ్యాధి సోకుతుంది
  •  అలాగే ప్రతి ఏడాది ఐదేళ్ల లోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు
  • ఇక భారత దేశంలో అయితే ఏడాదికి రెండు లక్షల మంది పిల్లల్ని ఈ వ్యాధి పొట్టన పెట్టుకుంటుంది
  •  ఈ వ్యాధి అన్ని వయసుల వారికి వస్తుంది.
  •  (5 ఏళ్లలోపు పిల్లలు & 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో) వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది
  •  కారణం
  •  రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉండటం
  •  దీని లక్షణాలు
  •  దగ్గు దగ్గినప్పుడు రక్తం రావడం
  •  ఆయాసం , అలసట
  •  ఛాతిలో నొప్పి
  •  ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం
  •  జ్వరం , చలి వణుకు పుట్టడం
  •  తలనొప్పి ,కండరాల నొప్పులు
  •  చెమటలు పట్టడం
  •  గుండె వేగంగా కొట్టుకోవడం అదేవిధంగా తక్కువ కొట్టుకోవడం
  •  వాంతులు విరోచనాలు ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు
05/12/2023 PDF File  :- LINK
TODAY PDF File  :-  LINK
(16 To 25) Nov 2023 Weekly PDF File :-  LINK


 రాజ్యాంగ దినోత్సవం
  •  26 నవంబర్ ని భారత రాజ్యాంగ దినోత్సవం గా పేర్కొంటాము
  •  దానికి కారణం
  •  1949 నవంబర్ 26న మనకు రాజ్యాంగం అనేది అందుబాటులోకి వచ్చింది
  •  రాజ్యాంగం అనేది పూర్తిస్థాయిలో రాయబడడం అనేది జరిగింది
  •  భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తే రాసింది
  •  సుమారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలాన్ని తీసుకొని భారత రాజ్యాంగ పరిషత్తే భారత రాజ్యాంగానికి రూపకల్పన చేయడం జరిగింది
  •  1949 నవంబర్ 26న మన రాజ్యాంగం అనేది అందుబాటులోకి వచ్చినప్పటికీ
  •  అది అమల్లోకి వచ్చింది మాత్రం 26 జనవరి 1950 అని గుర్తించాలి
  • 2015 కి ముందు నవంబర్ 26వ తేదీని నేషనల్ లాడేగా జరుపుకునే వాళ్ళం
  •  కానీ 2015 తర్వాత
  •  సామాజిక న్యాయం& సాధికారిక మంత్రిత్వ శాఖ వారి యొక్క సూచనతో ఈ తేదీని
  • రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది
05/12/2023 PDF File  :- LINK
TODAY PDF File  :-  LINK
(16 To 25) Nov 2023 Weekly PDF File :-  LINK





TODAY PDF File  :-  LINK




Comments