Weekly Current Affairs In Telugu || 16 Nov 2023 To 25 Nov 2023 || By Notifications Academy

 బిర్సా ముండా

  • చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందిన గిరిజన నాయకుడు  
  • 15 నవంబర్ 1875 బిర్సా ముండా జన్మించారు
  • ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించారు
  • బిర్సా ముండాకు సంబంధించి ప్రత్యేకతలు
  • బ్రిటిష్ వలస రాజ్యాల ఉనికిని పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు
  • దానికి గల కారణం 
  • బ్రిటిష్ వారు గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుంది
  • క్రైస్తవ మతంలోకి మార్చడాన్ని ఆయన పూర్తిస్థాయిలో వ్యతిరేకించాడు 
  • బీర్ సైత్ అనే సంస్థను స్థాపించి ఆ గిరిజనులలో విశ్వాసాన్ని కలిగించాడు 
  • ఈ సంస్థ ద్వారా మతమార్పిడికి సంబంధించిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు 
  • ముండా తెగకు ముందుండి నాయకత్వం వహించాడు 
  • ముండారాజ్ ను స్థాపించాలి అనుకున్నాడు 
  • ముండా రాజ్ అంటే Self Rule అని అర్థం
  • అడవి పైన అదే విధంగా భూమి పైన పూర్తి స్థాయిలో గిరిజనులకే హక్కు ఉండడం దాన్నే ముండా రాజ్ అంటాము 
  • వలసవాద చట్టాలను అదేవిధంగా శిస్తూ చెల్లించడాన్ని నిరాకరించాడు 
  • ఈయన ఉల్గులన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు
  • ఈ ఉద్యమంలో గెరిల్లా యుద్ద తంత్రం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. 
  • మతమార్పిడులకు ప్రయత్నించేటటువంటి వారిని దీని ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాడు 
  • గిరిజనుల్లో సామాజిక మార్పును తీసుకువచ్చింది 
  • ఈ ఉల్గులన్ ఉద్యమం అనేది ముండారాజ్ సంస్థ ను స్థాపించడానికి కారణమైంది  
  • ఈయన అనుచరులు భగవాన్ గా =} దేవుడిగా 
  • ధరితి అబా గా =} భూమి తండ్రిగా బీర్సా ముండాను కొలవడం జరుగుతుంది
  • ఆయన జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివాస్ గా జరుపుకుంటాం 
  • ఝార్ఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 15 ఏర్పాటు అయింది 
  • భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది 
  • జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

మాదిగ ఉప వర్గీకరణ

  • ఇటీవల నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన సదస్సులో షెడ్యూల్ కులాల(SC)లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఉప వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సదస్సులో పేర్కొనడం జరిగింది 
  • షెడ్యూల్ కులాలను ఏ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించడాన్నే SC ఉప వర్గీకరణ గా ప్రస్తావిస్తాం
  • సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేటువంటి పంపిణీ చేపడతాయి
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 
  • మొత్తం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే
  • మాదిగలు = 67,02,609 మంది ఉన్నారు,
  • మాలలు = 55,70,244 మంది జనాబా ఉన్నారు  
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం SC జనాభాలో మాదిగ సామాజిక వర్గం దాదాపు 50% పైగా ఉన్నారు 
  • 1994 నుంచి SC ఉప వర్గీకరణ కోసం పోరాడుతూ, వాదిస్తూ వస్తున్నారు 
  • దానికి కారణం ఎస్సీ కేటగిరి కి కేటాయించిన రిజర్వేషన్స్ అనేవి మాల సామాజిక వర్గం వారే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు
  • ఉప వర్గీకరణ చేయడం ద్వారా సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేవి అందరికీ అందించబడతాయి 
  • మాదిగలు చారిత్రాత్మకంగా చూస్తే చర్మ శుద్ధి , తోలు పని 
  • అదే విధంగా చిన్న చిన్న చేతి పనులు తో సంబంధం కలిగి ఉన్నారని మనం గమనించవచ్చు 
  • వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అత్యధికంగా మాదిగ సామాజిక వర్గానికే చెందిన వారనే గుర్తించాలి

27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం

  • బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా భారత దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది
  • బీహార్ కి దక్షిణ దిగువన ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కలుపుకొని జార్ఖండ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేది జరిగింది
  • 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తించాలి 
  • భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని,  
  • జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి అని పైన చెప్పిన అంశం లో చదువుకొన్నాము 
  • జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు 
  • జార్ఖండ్ రాష్ట్రము గొప్ప ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందింది 
  • యురేనియం, మైకా, బాక్సైట్ , గ్రానైట్ ,గోల్డ్ సిల్వర్, గ్రాఫైట్, డోలమైట్, మ్యాగ్న టైట్, బొగ్గు, ఇనుము, రాగి వంటి గొప్ప ఖనిజ సంపద ఇక్కడ మనకు లభ్యమవుతుంది 
  • 32 శాతం బొగ్గు ఝార్ఖండ్ నుంచి లభిస్తుంది 
  • 25% రాగి జార్ఖండ్ నుంచే పొందడం జరుగుతుంది

27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

భారతీయ మహిళా సరికొత్త రికార్డు

  • ప్రముఖ భారతీయ మహిళ స్కై డైవర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజాన్ అరుదైన రికార్డును సృష్టించారు 
  • ఎవరెస్టు శిఖరం ముందు 21500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి స్కై డైవ్ చేయడం అనేది జరిగింది 
  • అలా స్కై డైవ్ చేసి 17444 అడుగుల ఎత్తులో ఉన్న కాలాపత్తర్ లో సేఫ్ గా లాండ్ అయ్యారు 
  • ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు 
  • శీతల్ మహాజన్ గతంలో కూడా స్కై డైవింగ్ చేసి ఇప్పటికే పలు రికార్డులను పొందారు 
  • ఈ భారీ విన్యాసాలన్నీ పూర్తి చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

2030 నాటికి తగ్గేది రెండు శాతం ఉద్గారాలే

  • 2015 వ సంవత్సరంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ లోని పారిస్ లో కాప్ 21 కి సంబంధించి ఒక సమావేశం అనేది జరిగింది
  • ఈ సమావేశం యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడింది
  • దీంట్లో మనకు 195 దేశాలు పాల్గొన్నాయి
  • ఈ సమావేశం యొక్క ప్రత్యేకతలు 
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటీ గ్రేడ్ లోపు పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది
  • ఇలా హానికరక ఉద్గారాలకు కళ్లెం వేయాలని ఘనంగా మన లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం పోకడాలు ప్రకారం చూస్తే వాటిని సాధించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు
  • 2030 నాటికి 43% మేరా ఈ ఉద్గారాలను కళ్లెం వేస్తే తప్ప ఈ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకోవడం సాధ్యం కాదు 
  • ఐరాస యొక్క తాజా నివేదిక ప్రకారం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రెండు శాతం మాత్రమే అడ్డుకట్ట వేయగలమని పేర్కొనడం జరిగింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

  Open AI సృష్టికర్త తొలగింపు

  •  దీనిని చాట్ జిపిటి అని కూడా పిలుస్తాము
  •  ఈ Chat GPT అనేది ఒక చాట్ బాట్ అంటే అర్థం
  •  చాట్ బాట్ అంటే అర్థం మనుషులతో సంభాషణ అనుకరించడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ని చాట్ బాట్ గా పేర్కొంటాము
  •  తాజాగా దానిని రూపొందించిన శామ్ ఆల్ట్ మన్ ను CEO బాధ్యత నుంచి తొలగిస్తూ Open AI సంస్థ కీలక నిర్ణయం తీసుకోంది
  •  అతడి స్థానంలో తాత్కాలికంగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి CEO గా వ్యవహరిస్తారని కంపెనీ ప్రకటించింది
  •  అలాగే Open AI సహా వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడైన గ్రెగ్ ట్రాక్ మెన్ కూడా తన పదవికి రాజీనామా చేయడం జరిగింది
  •  ఆల్ట్ మెన్ తొలగించడానికి గల కారణం
  •  మైక్రోసాఫ్ట్ ఆర్థిక మద్దతు గల Open AI సంస్థ శామ్ ఆల్ట్ మన్ ను విశ్వసించకపోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు
  • కానీ టెక్ వర్గాలు ఆల్ట్ మెన్ తొలగింపుకు వేరే కారణాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 పారీకర్ యువ శాస్త్రవేత్త అవార్డు
  •  యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం మనోహర్ పారీకర్ పేరుతో పారీకర్ యువ శాస్త్రవేత్త అవార్డును ప్రారంభించడం జరిగింది
  •  తొలిసారిగా ఈ అవార్డును ఇస్రో అనుబంధ సంస్థ =} యు ఆర్ రావు సాటిలైట్ సెంటర్ కు చెందిన డాక్టర్ ఎస్ మాధవ రాజ్ ను పారీకర్ అవార్డుకు ఎంపిక చేసారు
  •  ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ కుమార్ సావంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు
  •  డిసెంబర్ 13న మనోహర్ పారీకర్ విజ్ఞాన్ మహోత్సవం అనే కార్యక్రమంలో ఈ అవార్డును అందిస్తారు
  •  అలాగే 5 లక్షల నగదును కూడా అందించడం జరుగుతుంది
  •  చంద్రయాన్ 3 మిషన్ కు సంబంధించి ఉపగ్రహ పథాన్ని రూపొందించిన వ్యక్తిగా మాధవరాజ్ ను పేర్కొంటాము
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 ఆర్థిక వృద్ధిలో సుగంధ ద్రవ్యాలు
  •  హైదరాబాదు కేంద్రంగా All India Spices Exports Forum వారి ఆధ్వర్యంలో జాతీయ సుగంధ ద్రవ్యాలకు సంబంధించి రెండో విడత సదస్సు జరిగింది
  •  ఈ సదస్సులో వరల్డ్  స్పైస్ ఆర్గనైజేషన్ చైర్మన్ =} రామ్ కుమార్ మీనన్ పాల్గొన్నారు
  •  ప్రస్తుతం దేశంలో కోటి 3 లక్షల టన్నుల్లో సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి జరుగుతుంది
  •  వీటి విలువ 1.5 లక్షల కోట్లు ఉంది
  •  మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి సుగంధ ద్రవ్యాల్లో 85% దేశంలోనే వినియోగిస్తున్నాము
  •  కేవలం 15% మాత్రమే ఎగుమతి చేస్తున్నాము
  •  ఆ 15% ఎగమతుల విలువ వచ్చేసి నాలుగు బిలియన్ల డాలర్లు (32 వేల కోట్లు)
  •  ఈ ఎగుమతి అనేది 2030 నాటికి పది బిలియన్ల డాలర్లకు (80 వేల కోట్లకు) చేరుకుంటుందని ఆయన ఈ సదస్సులో తెలియజేయడం జరిగింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 RBI మాజీ గవర్నర్ కన్నుమూత
  •  రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ అయిన ఎస్ వెంకట రమణన్ కన్నుమూయడం జరిగింది
  •  వీరు 1931లో ట్రావెన్ కోర్ సంస్థానంలోని నాగర్ కోయిల్ లో జన్మించారు
  •  1990 నుంచి 92 మధ్యకాలంలో RBI గవర్నర్ గా వ్యవహరించారు
  •  గవర్నర్ కాకముందు 1985 నుంచి 89 మధ్య కాలంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
  •  వీరు RBI GOVERNOR గా ఉన్నటువంటి సమయంలోనే దేశంలో సరళికరణ ఆర్థిక విధానాలు అవలంబించబడ్డాయి
  •  ప్రస్తుత RBI గవర్నర్ =} శక్తి కాంత దాస్
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

భారత ఆర్థిక వృద్ధి

  •  2024-26 ఆర్దిక సంవత్సరాలలో భారత ఆర్థిక వృద్ధి రేటు అనేది ఏటా 6 నుంచి 7.1 శాతం మేర నమోదు అవుతుంది అని ప్రముఖ ఎస్ అండ్ పి గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది
  •  ఏప్రిల్ ఒకటో తేదీతో ప్రారంభమై మార్చి 31 వ తేదీతో ముగిస్తే దానిని ఒక ఆర్థిక సంవత్సరంగా చెప్తాము
  •  గ్లోబల్ బ్యాక్స్ కంట్రీ బై కంట్రీ అవుట్ లుక్ 2024  నివేదికలో ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది
  •  భారత వాస్తవ జీడీపీ రేటు అనేది 6.1 శాతంగా నమోదయింది
  •  మార్చి త్రైమాసికం నాటికి 6.1 శాతంగా నమోదైన భారత వాస్తవ జీడీపీ రేటు అనేది జూన్ త్రైమాసికానికి ఆ యొక్క జిడిపి అనేది 7.8 శాతానికి పెరిగింది
  • 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, మరీ ముఖ్యంగా జపాన్ ను అధిగమిస్తుందని ఈ సంస్థ గతంలోనే తన నివేదికలో చెప్పింది
  •  ఇప్పుడు తాజాగా భారత వృద్ధిరేటుకు సంబంధించి ఈ సంస్థ తన నివేదికను రూపొందించింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 విశ్వసుందరిగా షెన్నిస్
  •  విశ్వ సుందరిని ఇంగ్లీషులో Miss Universeగా పిలుస్తాము
  •  సెంట్రల్ అమెరికా లోని నికారాగువా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ నూతన విశ్వసుందరిగా అవతరించారు
  •  ఈ పోటీలు అనేవి నికారాగువా దేశానికి సంబంధించినంత వరకు ఇది తొలి విజయం అని గుర్తించాలి
  •  ప్రస్తుత విశ్వసుందరిగా షెన్నిస్ పలాసియోస్ ని పేర్కొంటే,
  •  బాని గాబ్రియల్ ని మాజీ విశ్వసుందరిగా పేర్కొనడం అనేది జరుగుతుంది
  •  మాజీ విశ్వసుందరి అయిన బాని గాబ్రియల్ మిస్ యూనివర్స్ కిరీటాన్ని షెన్నిస్ కు అలంకరించి అభినందనలు తెలియ జేయడం జరిగింది
  •  ఈ ప్రతిష్టాత్మక  ‘‘మిస్ యూనివర్స్ 2023’’ పోటీలు నవంబర్ 19 న నిర్వహించబడ్డాయి
  •  ఈ పోటీల్లో 84 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు
  •  థాయిలాండ్ - ఆంటోనియా ఫోర్సిల్డ్ - మొదటి రన్నరప్
  •  ఆస్ట్రేలియా - మొరాయ విల్సన్ - రెండో రన్నరప్
  •  భారతదేశ౦ నుంచి శ్వేతా శారద తొలి 20 జాబితాలో నిలవడం జరిగింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
  •  ఈ పురస్కారాన్ని ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం అని కూడా పిలుస్తాము
  •  మానవాళికి అసాధారణమైన సేవలు అందించినటువంటి వ్యక్తులకి, వ్యవస్థలకు అదే విధంగా సంస్థలకు సత్కరించడం కోసం ఈ బహుమతుల్ని అందించడం జరుగుతుంది
  •  20వ శతాబ్దపు అద్భుత నేతల్లో ఒకరైనా ఇందిరా గాంధీ గారి పేరు మీద ప్రతి ఏటా ఈ అవార్డుల ప్రధానోత్సవం చేయడం అనేది జరుగుతుంది
  •  ఈ పురస్కారాన్ని1986 లో ప్రారంభించారు
  •  తొలుత PGA parliamentarians for global action వారికి ఇవ్వడం జరిగింది
  •  వీటి ప్రధానోత్సవం న్యూఢిల్లీ లో జరుగుతుంది
  •  గ్రహీతలకు 25 లక్షల రూపాయలు అందిస్తారు
  •  ప్రస్తుతం ఈ పురస్కారాన్ని భారత కోవిడ్ వారియర్లు గెలుచుకున్నారు
  •  వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ గారు
  •  అలాగే భారత ట్రైన్డ్ నర్సుల సంఘం ప్రెసిడెంట్ రాయ్ కే జార్జ్ ఈ పురస్కారాన్ని  అందుకున్నాయి
  •  కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని ప్రతి వైద్యుడు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది వీరందరూ కూడా
  •  ఈ మహమ్మారి సమయంలోఅందించిన నిస్వార్థ సేవలు, చూపిన అంకితభావం ,పట్టుదలకు నిర్దర్శనంగా ఈ అవార్డును అందించడం జరిగింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్
  •  ఇంగ్లాండులో సస్ సెక్స్ కౌంటీ తూర్పు ప్రాంతంలోని లెవెస్ పట్టణాన్ని బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేర్కొంటాము
  •  ఇక్కడ ప్రతిఏటా నవంబర్ మాసంలో బోన్ ఫైర్ వేడుకలు అనేటువంటి ఘనంగా నిర్వహించబడతాయి
  •  దాంట్లో భాగంగా ప్రతి వీధిలో కూడా భోగిమంటలాంటి చలి మంటలు కలిగిన నెగళ్లను ఏర్పాటు చేస్తారు
  •  దానితోపాటు సాంప్రదాయ వేషాధారణతో కాకడాలు వెలిగించి ఊరేగింపు తీస్తారు
  •  అలాగే బాణాసంచాను కాలుస్తారు
  •  ఈ యొక్క వేడుకను పండగల నిర్వహిస్తారు
  •  బోన్ ఫైం క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన పట్టణం ఏది? 
  •  లెవెస్ పట్టణ౦ 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

 SPG
  •  SPG - Special Protection Group
  •  ప్రధానమంత్రి యొక్క రక్షణ బాధ్యతను చూసే ఒక ప్రత్యేక భద్రతా దళాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ గా ప్రస్తావిస్తాం
  •  ఈ యొక్క ప్రత్యేక దళానికి నవంబర్ 17న కొత్త డైరెక్టర్ గా అలోక్ శర్మ నియమితులు కావడం జరిగింది
  •  ఈ అలోక్ శర్మ 1991 బ్యాచ్ కు  చెందిన IPS అధికారి
  •  ప్రస్తుతం వీరు SPG లో అదనపు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నారు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

మ్యూజిక్ ఫ్రాగ్ (సంగత మండూకం)

  • అరుణాచల్ ప్రదేశ్ లోని బ్రహ్మపుత్ర నది తీరంలో శాస్త్రవేత్తలు మ్యూజిక్ ఫ్రాగ్ అనే కొత్త జాతి కప్పలను కనుక్కోవడం జరిగింది
  • ఈ బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్ లో స్థానికంగా దిహంగ్ అని కూడా పిలుస్తారు
  • ఈ నదీతీరంలో మ్యూజిక్ ఫ్రాగులనేవి కనిపించడం అనేది జరిగింది 
  • వీటి ప్రత్యేకతలు 
  • ఇక్కడ ఆడ మగ రెండు కప్పలు కూడా చప్పట్లు చేస్తాయి
  • ఈ కప్పలు 6cm మేరా పెరుగుతాయి మధ్యలో లేత క్రీమ్ రంగులో గీత ఉంటుంది 
  • ఈ రకమైన జాతి కప్పలు రెండు నుంచి మూడు రకాల చప్పులతో ప్రత్యేకమైన శబ్దాన్ని అందిస్తాయి 
  • ఆ శబ్దాలు అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్నాయి 
  • ఈ విషయాన్ని ప్రముఖ సైన్స్ పత్రిక =} జూటాక్సాలో తెలియజేయడం జరిగింది 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

డీప్ ఫేక్ వీడియో
  • ఇటీవల సినీనటి రష్మిక మందన, హీరోయిన్ కాజల్ , సచిన్ టెండూల్కర్ కూతురైన సారా టెండూల్కర్ వీరందరూ కూడా ఈ డీప్ ఫేక్ వీడియోల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు 
  • డీప్ ఫేక్ వీడియోలు అంటే 
  • డీప్ లర్నింగ్ ఫేక్ పదాల కలయికని ఈ డీప్ ఫేక్ గా చెప్తాము
  • ఒక వీడియోలోని అసలు వ్యక్తి మొఖాన్ని శరీరాన్ని ఆల్గరిథం సహాయంతో మార్పు చేసే ఫేక్ వీడియోలను డీప్ ఫేక్ వీడియోలుగా పరిగణిస్తాం
  • ఈ డీప్ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలి 
  • కళ్ళ కదలికలు కనురెప్పలు కదలికలు సరిగా లేకపోతే అది డీప్ ఫేక్ వీడియో
  • మనిషి వెనకాల ఉన్న Background కి మధ్య కలర్ Brightness వంటివి మ్యాచ్ అవ్వకపోతే అది ఫేక్ గా భావించవచ్చు
  • లిప్ కనుక ఆ ఆడియో కి సింక్ అవ్వకపోతే అది డీప్ ఫేక్ వీడియో అయిందని చెప్పవచ్చు 
  • ఆ నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది
  • సామాజిక మాధ్యమ సంస్థల ప్రతినిధులతో కేంద్ర మంత్రి అయిన అశ్వినీ వైష్ణవ్ గురువారం వారితో చర్చలు జరపడం జరిగింది 
  • కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి =} రాజీవ్ చంద్రశేఖర్ 
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిప్ ఫేక్ తో సృష్టించే నకిలీ సమాచార వ్యాప్తి నుంచి ప్రజలను కాపాడేందుకు అవసరమైతే చట్టం కూడా తీసుకొస్తామని తెలిపారు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

5 పరుగుల పెనాల్టీ
  • ప్రపంచ క్రికెట్ కి గవర్నింగ్ బాడీగా ఉన్న ఐసీసీ వారు కొత్తగా బౌలింగ్ ఆలస్యం చేస్తే 5 పరుగుల పెనాల్టీ అనే కొత్త నిబంధనను తీసుకురావడం జరిగింది
  • ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే , t20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా stop clock ను ప్రవేశపెట్టాలని  కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది 
  • అంటే అర్థం ఓవర్ పూర్తయిన 60 సెకండ్లలోపు తర్వాతి ఓవర్ ను మొదలు పెట్టడంలో ఫీలింగ్ జట్టు మూడోసారి గనక విఫలమైతే ఆ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీని విధిస్తారు 
  • ఈ నిర్ణయాన్ని ఐసీసీ వారు మంగళవారం జరిగిన సమావేశంలో  తీసుకున్నారు 
  • ఈ నిబంధన 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ప్రయోగాత్మకంగా వన్డే, T20 క్రికెట్ ఫార్మాట్లో పరిశీలించనున్నారు
  • ఇదే సమావేశంలో క్రికెట్ పిచ్ పై నిషేధించే నిబంధనలో కూడా ఐసీసీ వారు మార్పులు చేశారు  
  • గతంలో ఒక పిచ్ ను నిషేధించాలంటే 5 పాయింట్లు పొందితే ఆ పిచ్ నిషేధానికి గురి అయ్యేది. 
  • ఇప్పుడు ఆ పాయింట్లు అనేవి ఆరు కు పెంచడం అనేటువంటి జరిగింది 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

SATHEE
  • ఇది ఒక ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ఫామ్ 
  • ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ ఫామ్ ఈ SATHEE ని ఉపయోగించాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వారు రాష్ట్రలను కోరడం జరిగింది 
  • IIT ,JEE , NEET వంటి ప్రవేశ పరీక్షలకు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అధిక మొత్తంలో విద్యార్థుల నుంచి వసూలు డబ్బులు చేస్తున్నారు 
  • ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఉచిత అభ్యాస వేదికను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో SATHEE అనే ఒక ఆన్లైన్ కోచింగ్ ప్లాట్ ఫామ్ ను కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ వారు 
  • అలాగే IIT కాన్పూర్ వారు సంయుక్తంగా SATHEE నీ రూపొందించడం జరిగింది 
  • ఇది 45 రోజుల క్రాష్ కోర్స్  ఈ క్రాష్ కోర్సులో లైవ్ క్లాసెస్ , Recorded classes అందుబాటులో ఉంటాయి. 
  • ఈ విషయాన్ని ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ అయినా గణేష్ గారు తెలియజేశారు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

ఆసియన్-ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్

  • ఇండోనేషియా (జకార్తా) లో భారత్ 5 రోజుల పాటు జరిగే తృణధాన్యాల పండుగను బుధవారం ప్రారంభించింది 
  • దీని లక్ష్యం 
  • రైతు అనుకూల చిరుధాన్యాలపై అవగాహన పెంచడం  
  • సుస్థిర ఆహారాన్ని ఎంపిక చేయడం 
  • సిరి ధాన్యాలతో తయారు చేసే ఆహార ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం 
  • పది దేశాల సభ్యత్వం గల ఆసియన్ కూటమిలో వ్యాపార అవకాశాలు కల్పించడం
  • భారత వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ , The Indian mission to ASEAN వారు సంయుక్తంగా ఈ ఆసియన్ - ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ ని ప్రారంభించడం జరిగింది
  • ఈ ఫెస్టివల్ ఐదు రోజులపాటు నిర్వహించబడుతుంది 
  • ఈ ఫెస్టివల్ లో భారత్ కు చెందిన FPOలు, అంకుర సంస్థలు, అదేవిధంగా చెప్ లు వీరందరూ కూడా పాల్గొననున్నారు 
  • ఆసియన్ కూటమిలో సభ్యత్వం కలిగిన దేశాలు 
  • ఇండోనేషియా,మలేషియా, పిలిపిన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనైన్, వియత్నం, లావోస్, మయన్మార్, కాంబోడియా
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

జస్టిస్ ఫాతిమా బివి
  • వీరు సుప్రీంకోర్టు యొక్క తొలి మహిళా న్యాయమూర్తి గా పని చేసారు 
  • కేరళలోని కొల్లం ఆసుపత్రిలో గురువారం కన్నుమూశారు 
  • ఫాతిమా బివి గారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు 
  • వీరి యొక్క ప్రత్యేకతలు 
  • 1927 ఏప్రిల్ 30న కేరళలోని పతనంథిట్ట లో జన్మించారు
  • తండ్రి ప్రోత్సాహంతో ఆమె న్యాయవాద వృత్తిని అభ్యసించారు
  • 1983 నుంచి 89 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు
  • 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేయడం అనేది కూడా జరిగింది
  • గతంలో వీరు తమిళనాడు గవర్నర్ గా కూడా పని చేశారు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

పాక్ అత్యున్నత పౌర పురస్కారం
  • నిషాన్-ఇ- పాకిస్తాన్ =} పాక్ యొక్క అత్యున్నత పౌర పురస్కారం 
  • ఈ అత్యున్నత పౌర పురస్కారం మాఫద్దాల్ సైఫుద్దీన్ వరించింది
  • మాఫద్దాల్ సైఫుద్దీన్ ప్రత్యేకతలు 
  • ముంబై కేంద్రంగా పనిచేసే దావూదీ బహ్ర ఇస్లామిక్ సంస్థ యొక్క అధిపతి యే ఈ సైఫుద్దీన్
  • ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల వరకు విస్తరించి ఉంది 
  • ఈ సంస్థకు ప్రస్తుతం సైఫుద్దీన్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు 
  • పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు ఆరిఫ్ ఆల్వి బుధవారం ఈ పురస్కరాల గ్రహితల వివరాలు ప్రకటించారు
  • ఈ పురస్కారం అందుకోనున్న నాలుగో భారతీయుడుగా సైఫుద్దీన్ చరిత్ర లో నిలిచారు 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

డీప్ ఫేక్ లపై కొరడా
  • వీటి కట్టడికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో గురువారం చర్చలు జరిపారు 
  • ఈ డీప్ ఫేక్ వీడియోలు నియంత్రించడానికి పది రోజుల్లో పూర్తిస్థాయి కార్యాచరణను సంబంధించి ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు  
  • ఆ ఫేక్ వీడియోలు సృష్టికర్తలకు జైలు శిక్ష & జరిమానాన్ని విధిస్తామని తెలియజేశారు
  • డిప్ ఫేక్ సృష్టికర్తలకు, దానిని ప్రసారం చేసిన వేదికకు పూర్తి బాధ్యత ఉంటుందని ఆయన పేర్కొనడం జరిగింది
  • NIA మరియు పౌరవిమానాయాన భద్రత
  • ఇటీవాళ ఎయిర్ ఇండియా పై బెదిరింపుతో ఖలిస్తాన్ యొక్క ఉగ్రవాది మరియు 
  • SFJ (సిక్కు ఫర్ జస్టిస్) వ్యవస్థాపకుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేయడంతో  ఈ అంశం వార్తల్లో నిలిచింది 
  • ఈ SFJ సంస్థని భారత్ 2019లో నిషేధించింది 
  • చట్ట విరుద్ధమైన సంస్థగా నిషేధించడం జరిగింది
  • దానికి కారణం 
  • దేశ వ్యతిరేక విధ్వంస కార్యకలాపాలకు పాల్పడుతుంది
  • జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇండియన్ పీనల్ కోడ్(IPC) లో SFJ కి వ్యతిరేకంగా చట్టపరంగా కొన్ని నిబంధనలు కూడా చేసింది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

సూపర్ సోనిక్ జెట్

  • కంకార్డ్ విమానం =} ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం 
  • దీని యొక్క వేగం 2180 km/hour 
  • ఈ కంకార్డ్ విమానాన్ని యునైటెడ్ కింగ్డమ్ మరియు ఫ్రాన్స్ వీరు ఇరువురు సంయుక్తంగా రూపొందించారు 
  • ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు అమెరికా ఓ కొత్త విమానాన్ని రూపొందిస్తుంది
  • దాని పేరు ఎక్స్ 59
  • ఈ ఎక్స్ 59 విమానాన్ని అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ అయిన నాసా వారు రూపొందిస్తున్నారు . 
  • ఈ ఎక్స్ 59 విమానం యొక్క ప్రత్యేకతలు 
  • న్యూయార్క్ నుంచి లండన్ కి కేవలం ఈ విమానం ద్వారా 90 నిమిషాలు చేరుకోవచ్చు 
  • ఇవి గంటకు 2400 నుంచి 4900 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాయి 
  • కర్ణ కఠోరంగా ఉండే సోనిక్ భూమ్ లు అనగా సోనిక్ సౌండ్స్ ని కలిగించకపోవడం ఈ యొక్క విమానం యొక్క ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

బుల్లెట్ ట్రైన్
  • ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన పనులు అనేవి ఇదివరకే మనకు ప్రారంభించబడ్డాయి 
  • ఈ ట్రైన్ అనేది మనకు 2026 లో అందుబాటులోకి వస్తుంది 
  • ఇది దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ 
  • ఈ మార్గంలో కీలక ప్రక్రియ పూర్తి చేసుకోవడం అనేది జరిగింది 
  • ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అయిన అశ్విని వైష్ణవ్ గారు ట్విట్టర్ (X)ద్వారా వీడియో రూపంలో తెలియజేశారు
  • ఈ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి 251 కిలోమీటర్ల మేర పిల్లర్లు,103 కిలోమీటర్ల ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అనేది పూర్తయింది 
  • ఇందులో కీలకంగా భావించే బాక్స్ గడ్డర్లు, సెగ్మెంటల్ గడ్డర్లు వీటి నిర్మాణం అనేది పూర్తి చేసుకుంది 
  • ఈ యొక్క ప్రాజెక్టును నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHRCL) వారు  పర్యవేక్షిస్తున్నారు
  • ఈ రైల్ క్యారీడర్ పొడవు వచ్చేసి 508 కిలోమీటర్లు 
  • ఈ సేవలు అందుబాటులోకి వస్తే ముంబై - అహ్మదాబాద్ కి 2.58 గంటల్లోనే చేరుకోవచ్చు 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

ISO
  • ISO =} INTERNATIONAL SUGAR ORGANISATION 
  • దీని ఏర్పాటు =} 1968
  • పంచదార అనుబంధ ఉత్పత్తుల అత్యున్నత సంఘంగా ISO ని పేర్కొంటాము 
  • లండన్ =} ప్రధాన కార్యాలయం 
  • ప్రతి యేటా వీటి సమావేశాలనేవి నిర్వహించబడతాయి
  • ISO ప్రధాన కార్యాలయంలో 63వ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. 
  • ISO చైర్మన్ షిప్ పగ్గాలను భారత్ 2024వ సంవత్సరంలో చేపట్టనుంది 
  • ఈ విషయాన్ని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వారు తెలియజేశారు 
  • భారత తరఫున ఈ సమావేశంలో కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా పాల్గొన్నారు
  • భారత దేశానికి ఇది అతిపెద్ద ఘనత అని గుర్తించాలి
  • అంతర్జాతీయ పంచదార రంగాన్ని ముందుండి నడిపించడం గొప్ప విషయంగానే భావించాలి 
  • ప్రపంచం లో అతి పెద్ద పంచదార వినిమయ దేశంగా భారత్ ఉంది
  • పంచదార ఉత్పత్తిలో భారత్ రెండో స్థానం లో నిలిచింది 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

FICCI (ఫిక్కీ) అధ్యక్షుడు
  • FICCI =} Federation Of Indian Chambers Of Commerce and Industry
  • ఈ FICCI అనేది లాభాలు ఆశించని ఒక NGO 
  • భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారులకు మరియు పరిశ్రమలకు ఇది ఒక గొంతుక
  • దేశ ఆర్థిక అభివృద్ధిలో తన తోడ్పాటును కూడా అందిస్తుంది 
  • FICCI నూతన అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ CEO ఎండి అనిష్ షా ఎంపిక అయ్యారు 
  • ఈ అనిష్ షా ప్రస్తుతం FICCI సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు 
  • ప్రస్తుత FICCI అధ్యక్షుడిగా శుభ్రకాంత్ పాండా ఉన్నారు 
  • ఈ అధ్యక్ష మార్పు అనేది డిసెంబర్ 8, 9 తేదీల్లో FICCI యొక్క 96వ వార్షిక సమావేశంలో జరగనుంది
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK

World Wushu Championship
  • 16 వ World Wushu Championship పోటీలు అమెరికాలోని టెక్సాస్ నగరంలో ఇటీవల ముగిశాయి 
  • United States of America Wushu Kung fu Federation (USAWKF) వారు ఈ పోటీలను నిర్వహించారు 
  • International Wushu Federation వారి ఆధ్వర్యంలో (USAWKF) వారు ఈ పోటీలు అనేవి నిర్వహించారు 
  • Wushu అనేది ఒక చైనా కు సంబంధించి ఒక యుద్ధకళ (మార్షల్ ఆర్ట్స్)
  • ఈ యొక్క క్రీడ అనేది వివిధ రూపాలను మరియు శైలులను కలిగి ఉంటుంది 
  • క్రమశిక్షణతో కూడిన అత్యంత శైలి కృత పోరాట రూపమే ఈ Wushu క్రీడాని గుర్తించాలి
  • ఈ పోటీలకు భారతదేశం నుంచి 
  • రుషి బీనాదేవి (రజతం)
  • కుశల్ కుమార్(కాంస్యం)
  • చవి (కాంస్యం) వీరు ఈ పోటీల్లో పాల్గొన్నారు 
27/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK


16/11/2023 PDF File  :-  LINK
19/11/2023 PDF File :-  LINK
20/11/2023 PDF File  :-  LINK
23/11/2023 PDF File  :-  LINK
24/11/2023 PDF File  :-  LINK
25/11/2023 PDF File  :-  LINK


ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

Comments