Weekly Current Affairs In Telugu || 27 Nov 2023 To 07 Dec 2023 || By Notifications Academy

 ఆదిత్య - L1

  •  సూర్యుడు పై పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రయోగాన్ని సూర్యయాన్ అంటాము
  •  ఆ సూర్యయాన్ పేరుతో తొలిసారిగా చేపట్టిన ప్రయోగాన్ని ఆదిత్య - L1 గా పేర్కొంటాము
  •  ఈ ఆదిత్య - L1 ఉపగ్రహాన్నిPSLV c-57 వాహన నౌక ద్వారా 1475 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 2023 సెప్టెంబర్ 2న నిర్దేశిత భూకక్షలోకి ప్రవేశ పెట్టడం అనేది జరిగింది
  •  శ్రీహరికోట రెండో ప్రయోగ వేదిక అయిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగాన్ని ప్రారంభించారు
  •  దీని యొక్క లక్ష్యం
  •  ముందుగా ఆదిత్య L1 ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ బిందువు 1 (L1-1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు
  •  వీటి దూరం :- భూమి నుంచి ఈ కక్ష్య కి 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది
  • ఈ కక్ష్యలో ప్రవేశపెట్టి సౌర గోళం పై నిరంతరం అధ్యయనం చేస్తారు
  •  ముఖ్యంగా సౌర చర్యలు, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తారు
  •  ఆదిత్య L1 ఉపగ్రహాం యొక్క ప్రత్యేకతలు
  •  ఈ ఉపగ్రహం బరువు వచ్చేసి 1475 కేజీలు
  •  1) సూర్యుడికి ఉన్న మరో పేరు ఆదిత్య
  •  2) ఈ ఉపగ్రహాన్ని లాగ్రేంజ్ అనే బిందువు వద్ద ప్రవేశ పెట్టాలి అనుకున్నారు కాబట్టి  Lఅని,
  •  3) ఇది సూర్యుడిపై అధ్యయనం చేసే మొదటి ఉపగ్రహము కావున 1 అని అలా ఈ ఉపగ్రహానికి ఆదిత్య L1 అని నామకరణం చేయడం జరిగింది
  •  ఈ ఉపగ్రహాన్ని బెంగళూరులోని ప్రొఫెసర్ యు ఆర్ రావు స్పేస్ సెంటర్లో (URSC) ఈ ఉపగ్రహాన్ని రూపొందించారు
  • URSC లో పనిచేస్తున్న సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కే శంకర సుబ్రమణియన్ ఆధ్వర్యంలో ఈ ఆదిత్య L1 ఉపగ్రహానికి రూపకల్పన చేసారు
  •  సూర్యుడు పై అధ్యయనం చేసేందుకు ప్రయోగించిన ప్రయోగాన్ని ఆదిత్య L1 అంటాము
  •  ఆ ఆదిత్య L1 తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంది,
  •  లాంగ్వేజ్ బిందువు L1 వద్ద ప్రవేశపెట్టాలనుకున్న ఈ ఉపగ్రహం వచ్చే ఏడాది జనవరి 07 నాటికి చేరుకుంటుంది
  •  ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ అయినా సోమనాథ్ గారు విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలియజేసారు
27/11/2023 PDF File  :-  
07/12/2023 PDF File  :-  LINK

 డెంగ్యూ వ్యాధి
  •  వాతావరణ మార్పులతో డెంగ్యూ విజృంభణ అనేది జరుగుతుంది
  •  దేశంలో వచ్చినటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ యొక్క వ్యాధి అనేది అన్ని ప్రాంతాలకు విస్తరించింది
  •  ఈశాన్య రాష్ట్రాల వారికి కొన్నేళ్ల క్రితం వరకు ఈ వ్యాధి గురించి అంతగా తెలియదు
  •  కానీ వాతావరణంలో వచ్చినటువంటి మార్పులు అనగా వర్షాపాతం, గాలిలో తేమ శాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు ఇవన్నీ కూడా వైరస్ వ్యాప్తికి , కొత్త వేరియంట్లు రావడానికి కారణమైంది
  •  దేశంలో ఒక ఏడాదిలో ఈ వ్యాధి వ్యాప్తి అనేది 5 - 6 నెలలకు పెరిగింది 
  •  ఇక డెంగ్యూకు సంబంధించి కొన్నిముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకున్నట్లయితే
  •  ఈ డెంగ్యూ జెనస్ ఫ్లావీ వైరస్ వల్ల వ్యాపిస్తుంది
  •  ప్రదానంగా ఈడెస్ జాతికి చెందిన ఈజిప్టి దోమల ద్వారా వ్యాపిస్తుంది
  •  ఈ దోమ చికెన్ గున్యా మరియు జీక ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులను కూడా కలుగజేస్తుంది
  •  ఈ వ్యాధి యొక్క లక్షణాలు
  •  అకస్మాత్తుగా అధిక జ్వరం వస్తుంది
  •  తీవ్రమైన తలనొప్పి
  •  కళ్ళ వెనుక నొప్పి
  •  తీవ్రమైన ఎముకల నొప్పులు
  •  కండరాల నొప్పులు
  •  కీళ్లనొప్పులు
  •  దీని యొక్క వ్యాక్సిన్ =} CYD TDV లేదా Dengvaxia
  •  2019లో US=} Food And Drugs Administration ఈ వ్యాక్సిన్ ని ఆమోదించింది
  •  ఇండోనేషియా దేశం వొలభాకియా బ్యాక్టీరియా కలిగిన దోమల్ని ఉపయోగించి డెంగ్యూ వ్యాధిని నియంత్రిస్తుంది
  • అలా ఉపయోగించి డెంగ్యూ ను నియంత్రిస్తున్న మొట్టమొదటి దేశం కూడా ఇండోనేషియా అనే గుర్తించాలి
 07/12/2023 PDF File  :-  LINK

ఆఫ్గాన్ శరణార్థులు
  • 2021లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పౌర ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్ లు అధికారాన్ని చేపట్టారు
  •  అనేకమంది ఆఫ్గాన్ వాసులు పలు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లారు
  •  ఎక్కువ మంది పాకిస్తాన్ కు వలస వెళ్లారు (21.3 లక్షల మంది)
  •  ఆఫ్గాన్ శరణార్థులని నవంబర్ 1 నాటికి దేశం విడిచిపోవాలని పాకిస్తాన్ ఆదేశించింది
  •  అక్కడే ఉన్న వారిపై పాక్ ఇప్పుడు చర్యలు తీసుకుంటుంది
  •  ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకుంది
  •  పాక్ ను వీడుతున్న ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులు నుంచి ఎగ్జిట్ చార్జీలను వసూలు చేయడం
  •  దాని అర్దం :- పాక్ ను వీడాలి అంటే 830 డాలర్లు (69వేల రూపాయలు) చెల్లించాల్సి ఉంటుంది
  •  ఈ 69 వేల రూపాయల మొత్తాన్ని ఒక్కో వ్యక్తిపై వసూలు చేయనున్నారు
  •  పాకిస్తాన్ అవలంబిస్తున్న ఈ విధానాన్నిపలు దేశాలు ఖండిస్తున్నాయి
  •  అయినప్పటికీ ఆ విధానాన్ని మార్చుకునే ఉద్దేశం లేదని ఆ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలియజేసింది

07/12/2023 PDF File  :-  LINK

 నిమోనియా
  •  చైనాలో నిమోనియా కేసుల విజృంభన
  •  ఈ కొత్త వైరస్ అనేది కోవిడ్ తరహాలోనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
  •  కేంద్రా ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ICMR, ఆరోగ్య సేవలో డైరెక్టర్ జనరల్ ఈ అంశంపై పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన వివరించారు
  •  కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను బెడ్లు, మందులు, ఇన్ ఫ్లూయెంజా వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, టెస్టింగ్ కిట్స్ వీటన్నిటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది
  •  నిమోనియాకు సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు
  •  ఊపిరితిత్తులకు వచ్చి ప్రాణాలు తీసే వ్యాధుల్లో ఒకటిగా నిమోనియాని చెప్తాము
  •  ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం
  •  అప్పుడే పుట్టిన పిల్లల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ నిమోనియా వ్యాధి సోకుతుంది
  •  అలాగే ప్రతి ఏడాది ఐదేళ్ల లోపు పిల్లలు రెండు మిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు
  • ఇక భారత దేశంలో అయితే ఏడాదికి రెండు లక్షల మంది పిల్లల్ని ఈ వ్యాధి పొట్టన పెట్టుకుంటుంది
  •  ఈ వ్యాధి అన్ని వయసుల వారికి వస్తుంది.
  •  (5 ఏళ్లలోపు పిల్లలు & 65 ఏళ్లు దాటిన వృద్ధుల్లో) వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది
  •  కారణం
  •  రోగనిరోధక శక్తి అనేది తక్కువ ఉండటం
  •  దీని లక్షణాలు
  •  దగ్గు దగ్గినప్పుడు రక్తం రావడం
  •  ఆయాసం , అలసట
  •  ఛాతిలో నొప్పి
  •  ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉండడం
  •  జ్వరం , చలి వణుకు పుట్టడం
  •  తలనొప్పి ,కండరాల నొప్పులు
  •  చెమటలు పట్టడం
  •  గుండె వేగంగా కొట్టుకోవడం అదేవిధంగా తక్కువ కొట్టుకోవడం
  •  వాంతులు విరోచనాలు ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలుగా చెప్పవచ్చు

07/12/2023 PDF File  :-  LINK

 రాజ్యాంగ దినోత్సవం
  •  26 నవంబర్ ని భారత రాజ్యాంగ దినోత్సవం గా పేర్కొంటాము
  •  దానికి కారణం
  •  1949 నవంబర్ 26న మనకు రాజ్యాంగం అనేది అందుబాటులోకి వచ్చింది
  •  రాజ్యాంగం అనేది పూర్తిస్థాయిలో రాయబడడం అనేది జరిగింది
  •  భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తే రాసింది
  •  సుమారు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలాన్ని తీసుకొని భారత రాజ్యాంగ పరిషత్తే భారత రాజ్యాంగానికి రూపకల్పన చేయడం జరిగింది
  •  1949 నవంబర్ 26న మన రాజ్యాంగం అనేది అందుబాటులోకి వచ్చినప్పటికీ
  •  అది అమల్లోకి వచ్చింది మాత్రం 26 జనవరి 1950 అని గుర్తించాలి
  • 2015 కి ముందు నవంబర్ 26వ తేదీని నేషనల్ లాడేగా జరుపుకునే వాళ్ళం
  •  కానీ 2015 తర్వాత
  •  సామాజిక న్యాయం& సాధికారిక మంత్రిత్వ శాఖ వారి యొక్క సూచనతో ఈ తేదీని
  • రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది

07/12/2023 PDF File  :-  LINK

Tribal University Bill

  • ఇటీవల కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు సమ్మక్క- సారక్క గిరిజన యూనివర్సిటీ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు
  • ఈ గిరిజన యూనివర్సిటీ పేరును చేర్చుతూ ప్రస్తుతం ఉన్న కేంద్ర యూనివర్సిటీ చట్టానికి సవరణలు ప్రతిపాదించారు 
  • 2009 సెంట్రల్ యూనివర్సిటీ చట్టాన్ని సవరించాలి 
  • తెలంగాణ రాష్ట్రంలో ఈ యూనివర్సిటీనీ ఏర్పాటు చేస్తున్నారు
  • స్థానిక ప్రజలకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుంది 
  • గిరిజన కలలు, సంస్కృతి సాంప్రదాయాలో పై పరిశోధనలు చేయవచ్చు
  • ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించవచ్చు 
  • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 :- ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన యూనివర్సిటీ ని ఏర్పాటు చేయాలి 
  • అందులో భాగంగానే ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు 
  • ఈ విశ్వవిద్యాలయానికి అయ్యే ఖర్చు 889 కోట్లు 
  • దీనిని ఏడు సంవత్సరాల లో పూర్తి చేయనున్నారు 
  • ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ(మొట్టమొదటి గిరిజన విశ్వవిద్యాలయం)
  • ప్రస్తుతం దేశంలో 27 Tribal Research Instituteలు ఉన్నాయి

07/12/2023 PDF File  :-  LINK

సైబర్ నేరాలు

  • ఇటీవల జాతీయ నేరాల నమోదు సంస్థ (NCRB) దేశవ్యాప్తంగా 2022 లో నమోదైన నేరాలకు సంబంధించి ఒక నివేదికను రూపొందించింది
  • ఆ నివేదికలో సైబర్ నేరాలు మరియు నకిలీ వార్తలను వ్యాప్తి చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది 
  • హత్యలు, దొంగతనాలు, దోపిడీ వంటి సాంప్రదాయ నేరాల విషయంలో రాష్ట్రంలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది

07/12/2023 PDF File  :-  LINK

మిజోరంలో కొత్త పాలన పగ్గాలు

  • మిజోరం రాష్ట్రంలో పాలనా పగ్గాలు చేపట్టడం కోసం ఐదేళ్ల కిందట జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేసింది 
  • అప్పుడు ఆ రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి 8 సీట్లు కట్టబెట్టారు 
  • మిజోరాంలో మనకు 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి
  • కొత్తగా జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీ 27 స్థానాలను గెలుచుకుంది 
  • కారణాలు 
  • BJP నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (NEDA) అనేది ఒకటి ఏర్పడింది 
  • ఈ కూటమిలో మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ భాగస్వామిగా ఉంది 
  • మణిపూర్ లో కుకిలపై దాడులు జరుగుతున్నాయి 
  • ఈ కుకిలకు, మిజోరంలో ప్రజలకు సన్నిహిత సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి
  • మణిపూర్ లో కుకిలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో కమలదళం విఫలమైంది మిజోరాం ప్రజలు జోరం పీపుల్స్ మూమెంట్ పార్టీకి పాలన పగ్గాల అందించారు 
  • మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ NEDA లో భాగస్వామిగా ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసింది 
  • జోరాంథంగా పై అవినీతి ఆరోపణలు రావడం ,ఆయన ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించకపోవడం ఇలా పలు అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయి 

07/12/2023 PDF File  :-  LINK

హైకోర్టు జడ్జిల బదిలీలు

  • హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి కొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్రం అడుగులు వేస్తుంది 
  • కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ న్యాయవాద వృత్తి నియంత్రణ బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్నప్పుడు ఈ అంశాన్ని తెలియజేశారు 
  • 1993లో మనకు కొలీజియం వ్యవస్థ అనేది అందుబాటులోకి వచ్చింది 
  • ఆ సుప్రీంకోర్టు యొక్క కొలీజియం సిఫార్సుల ఆధారంగానే 
  • జడ్జిల యొక్క బదిలీలు గాని, నియామకాలు గాని చేపట్టుతున్నారు

07/12/2023 PDF File  :-  LINK

తలసరి అప్పు

  • తలసరి ఆదాయాన్ని ఇంగ్లీషులో Per Capita Income అంటాము
  • జాతీయ ఆదాయాన్ని దేశ జనాభాతో భాగిస్తే వచ్చేది తలసరి ఆదాయం
  • తలసరి ఆదాయాన్ని దేశ అభివృద్ధికి కొలమానంగా సూచిస్తాము 
  • తలసరి ఆదాయం ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంత అభివృద్ధి చెందినట్టు 
  • ఆదే తలసరి అప్పు ఎంత ఎక్కువగా ఉంటే ఆ దేశం అంతగా క్షీణించినట్టు 
  • ఇటీవల తృణముల్ కాంగ్రెస్ సభ్యుడైన అటువంటి డెరెక్ ఓబ్రియన్ తలసరి అప్పు కు సంబంధించి లోక్ సభలో ఈ ప్రశ్నను లేవనెత్తడంతోనీ ఈ అంశం వార్తల్లో నిలిచింది
  • కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దీనికి సరైనటువంటి వివరణ ఇచ్చారు 
  • గత పది ఏళ్లలో తలసరి అప్పు 101% పైగా శాతం పెరిగింది 
  • తలసరి ఆదాయం మాత్రం కేవలం 62.59% మాత్రమే వృద్ధి చెందింది 
  • 2011-12 మార్చినాటికి కేంద్ర ప్రభుత్వ తలసరి అప్పు 29,127 రూపాయలు ఉంటే
  • 2022 -23 మార్చినాటికి 58,709 రూపాయలకి చేరింది 
  • దీంట్లో దేశ తలసరి అప్పు 26,481 నుంచి 55,528 రూపాయలకి చేరడం అనేది జరిగింది
  • ఇక విదేశీ తలసరి అప్పు 2647 రూపాయల నుంచి 3181 రూపాయలకు చేరడం జరిగింది 

07/12/2023 PDF File  :-  LINK

PM Kisan

  • Pradhan Mantri Kisan Samman Nidhi =} PM Kisan 
  • 2019లో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది 
  • దీని యొక్క ఉద్దేశం 
  • దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక సహాయం అందించడం 
  • ఈ పథకం ద్వారా ఏడాదికి ఆరువేల రూపాయలు అందిస్తారు 
  • ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తారు
  • 2018 వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రారంభించింది
  • ఈ పథకం ద్వారా రైతులకు 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు
  • ఈ స్కీమ్ తెలంగాణ ప్రాంతానికే పరిమితమైంది 
  • ఈ పథకం నుంచి ప్రేరణ పొందిన కేంద్ర ప్రభుత్వం 
  • దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పేరు మీదుగా రైతులకు ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది. 
  • ప్రస్తుతం పిఎం కిసాన్ కింద ఇచ్చే 6000 రూపాయల మొత్తాన్ని పెంచే ఆలోచన ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది 
  • ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ లోక్ సభలో జరిగిన సమావేశంలో తెలియజేసారు

07/12/2023 PDF File  :-  LINK

భారత ఆర్థిక వ్యవస్థ యొక్క స్థానం

  • 2030 నాటికి భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది  
  • ఈ విషయాన్ని ప్రముఖ S&P గ్లోబల్ మార్కెటింగ్ సంస్థ తన నివేదిక లో పేర్కొంది
  • 2023-24 లో 6.4 శాతంగా ఉన్న మన దేశ దేశ జీడీపీ వృద్ధి అనేది
  • 2024-25 నాటికి 6.9% శాతంగా,
  • 2026-27 నాటికి 7% శాతంగా 
  • 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని ఈ S&P గ్లోబల్ సంస్థ తన నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది
  • ప్రస్తుతం భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది 
  • భారత్ 2030 నాటికి జపాన్ ని అధిగమించి ఆసియా పసిఫిక్ లో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపాంతరం చెందే అవకాశం ఉంది 
  • 1) అమెరికా 
  • 2) చైనా 
  • 3) జర్మనీ 
  • 4) జపాన్
  • భారత్ ముందున్న సవాళ్లు :- 
  • తయారీ రంగాన్ని అభివృద్ధి పరచుకోవాలి 
  • తయారీ రంగానికి కేంద్రంగా నిలపడమే భారత్ ముందున్నటువంటి అతిపెద్ద సవాలు

07/12/2023 PDF File  :-  LINK

AAAI

  • దీని యొక్క పూర్తి నామం అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 
  • ఈ అసోసియేషన్ కి సంబంధించి డిసెంబర్ 1న సర్వసభ్య సమావేశం జరిగింది 
  • ఈ సమావేశం యొక్క ప్రత్యేకత 
  • అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా యొక్క 
  • అధ్యక్షుడిగా ప్రశాంత్ కుమార్ ని ఎంపిక చేస్తే,  
  • ఉపాధ్యక్షుడిగా రానా బారువాను ఎంపిక చేసారు
  • ప్రశాంత్ కుమార్ =} (గ్రూప్ ఎం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ దక్షిణాసియా CEO) 
  • రానా బారువా =} (హవాస్ ఇండియా గ్రూప్ CEO)
  • వీరిరువురిని అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నిక చేయడంతో పాటు 
  • ఈ అసోసియేషన్ కి పలువురు సభ్యులను కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది
07/12/2023 PDF File  :-  LINK

Forbes Magazine

  •  ప్ఫోర్బ్స్ మ్యాగజైన్ =} ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది
  •  ఈ నివేదికలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు చోటు సంపాదించారు 
  •  ఎంపికకు ప్రమాణాలు :-
  •  రాజకీయం
  •  వ్యాపారం 
  •  ఆర్థిక రంగం
  •  మీడియా
  •  వినోదా రంగం
  •  వీటిలో ప్రపంచ స్థాయిలో ప్రభావంతమైన మహిళలను గుర్తించి ఎంపిక చేస్తారు
  •  భారత్ నుంచి నలుగురు ఈ జాబితాలో నిలిచారు
  • 1) నిర్మల సీతారామన్
  • 2) HCL వ్యవస్థాపకుడైన కుమార్తె రోష్ని నాడర్ మల్హోత్రా (60వ స్థానం )
  • 3) SAIL చైర్ పర్సన్ సోమ మండల్ (70వ స్థానం)
  •  4) ప్రముఖ వ్యాపారవేత్రి కిరణ్ ముజుంధార్ షా (76వ స్థానం)
  •  నిర్మల సీతారామన్ గారు
  •  ఇప్పటికే వీరు ఈ జాబితాలో ఐదు సార్లు చోటు సంపాదించుకున్నారు
  •  ప్రస్తుతం వెలువడినటువంటి ఈ జాబితాలో 32వ స్థానాన్ని కైవసం చేసుకొన్నారు

07/12/2023 PDF File  :-  LINK

 గార్భా

  •  గుజరాత్ లో ప్రజాధరణ పొందినటువంటి నృత్యాలలో ఒకటి గా గార్భా నృత్యాన్ని పేర్కొంటాము
  •  యునెస్కో కు చెందిన ICH సంస్థ అనగా ఇంటాన్ జబుల్  కల్చరల్ హెరిటేజ్ జాబితాలో గార్భా నృత్యం చోటు సంపాదించుకుంది
  •  బోట్స్ వాన కేంద్రంగా ICH నుంచి ఇంటర్ గవర్నమెంటల్ కమిటీకి సంబంధించి 18వ సమావేశం ఒకటి జరిగింది
  •  ఈ సమావేశంలో గార్భా నృత్యాన్ని ICH జాబితాలో గుర్తించారు
  •  ఈ గార్భా డాన్స్ యొక్క ప్రత్యేకతలు 
  •  సామాజిక లింగ సమానత్వాన్ని పెంపొందిస్తుంది
  •  కమ్యూనిటీలను ఒక ఏకతాటి పైకి తీసుకొస్తుంది
  •  ICH కన్వెన్షన్ - 2003 నిబంధన ప్రకారం ఈ నృత్యాన్ని గుర్తించడం అనేది జరిగింది
07/12/2023 PDF File  :-  LINK
  •  మెస్సీ
  •  అర్జెంటీనా యొక్క దిగ్గజ ఫుట్ బాలర్ ఈ లియోనల్ మెస్సీ
  •  టైం మ్యాగజిన్ లియోనాల్ మెస్సీ ని అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసింది
  •  ఎంపిక గల కారణాలు
  • కొన్ని నెలల క్రితం లియోనాల్ మెస్సి అమెరికాకు చెందిన ఇంటర్ మియామీ క్లబ్ లో చేరాడు
  •  మెస్సి ఈ క్లబ్లో చేరినప్పటి నుంచి ఈ మియామీ క్లబ్ యొక్క రూపురేఖలే మారిపోయాయి
  •  దానికి నిదర్శన౦
  •  ఈ సీజన్లో 14 మ్యాచులు జరిగితే 11 గోల్స్ తో మియామీ క్లబ్ ను విజయ అవకాశాలు చేరవేశాడు
  •  మెస్సి వచ్చినప్పటి నుంచి అమెరికాలో ఫుట్బాల్ టోర్నీ వీక్షించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది
  •  ఈ మియామీ క్లబ్ యొక్క విజయాల్లో కీలకపాత్ర పోషించాడు
  •  టైం మ్యాగజిన్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ గా ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ఎంపిక చేసింది
  •  అందులో మూడో క్రీడాకారుడు మెస్సీ
  •  మెస్సీ కంటే ముందు
  •  దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్
  •  ప్రముఖ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్  వీరు ఉన్నారని గుర్తించాలి
07/12/2023 PDF File  :-  LINK
  •  డీప్ ఫేక్ వీడియోలు
  •  సినీనటి రష్మిక మందన, హీరోయిన్ కాజల్ , సారా టెండూల్కర్ తాజాగా ప్రియాంక చోప్రా, రతన్ టాటా వీరందరూ ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల పలు ఇబ్బందులను ఎదురుకున్నారు
  •  డీప్ ఫేక్ వీడియోలు :-
  •  డీప్ లర్నింగ్ ఫేక్ పదాల కలయికని ఈ డీప్ ఫేక్ గా చెప్తాము
  •  ఒక వీడియోలోని అసలు వ్యక్తి మొఖాన్ని శరీరాన్ని ఆల్గరిథం సహాయంతో మార్పు చేసే ఫేక్ వీడియోలు
  •  ఈ ఫేక్ వీడియోలను ఎలా గుర్తించాలి
  •  కళ్ళ కదలికలు కనురెప్పలు కదలికలు సరిగా లేకపోతే అది డీప్ ఫేక్ వీడియో
  • మనిషి వెనకాల ఉన్న Background కి మధ్య కలర్ Brightness వంటివి మ్యాచ్ అవ్వకపోతే అది ఫేక్ గా భావించవచ్చు
  • లిప్ కనుక ఆ ఆడియో కి సింక్ అవ్వకపోతే అది డీప్ ఫేక్ వీడియో అయిందని చెప్పవచ్చు
07/12/2023 PDF File  :-  LINK
  •  టేలర్ స్విఫ్ట్
  •  టైం మ్యాగజిన్ సంస్థ
  •  ప్రతి ఏటా పర్సన్ ఆఫ్ ది ఇయర్
  •  అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ వంటి జాబితాని విడుదల చేస్తుంది
  •  అమెరికాకు చెందిన ప్రముఖ నటి, గాయని మరియు రచయిత్రి అయిన టేలర్ స్విఫ్ట్ 2023 ఏడాదికి గాను టైం మ్యాగజిన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేయడం జరిగింది
  •  ఈ పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు పోటీపడ్డారు
  •  బార్బీ, కింగ్ చార్లెస్ 3 , ఓపెన్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సామ్ ఆల్ట్ మెన్ వీరందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొన్నారు
  •  గత వారం స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయినా spotify అత్యధికంగా ప్రాతినిధ్యం వహించిన కళాకారిని గా టేలర్ స్విఫ్ట్ ని ప్రకటించింది
  •  spotify ప్రకటించిన వారం తర్వాతే టైం మ్యాగజిన్ టేలర్ స్విఫ్ట్ ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేసింది
07/12/2023 PDF File  :-  LINK


ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 


07/12/2023 PDF File  :-  LINK

Comments