Daily Current Affairs In Telugu || 16 November 2023 || By Notifications Academy

 బిర్సా ముండా

  • చోటా నాగపూర్ పీఠభూమి ప్రాంతంలోని ముండా తెగకు చెందిన గిరిజన నాయకుడు  
  • 15 నవంబర్ 1875 బిర్సా ముండా జన్మించారు
  • ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ గారు నివాళులు అర్పించారు
  • బిర్సా ముండాకు సంబంధించి ప్రత్యేకతలు
  • బ్రిటిష్ వలస రాజ్యాల ఉనికిని పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు
  • దానికి గల కారణం 
  • బ్రిటిష్ వారు గిరిజనులను క్రైస్తవ మతంలోకి మార్చడం జరుగుతుంది
  • క్రైస్తవ మతంలోకి మార్చడాన్ని ఆయన పూర్తిస్థాయిలో వ్యతిరేకించాడు 
  • బీర్ సైత్ అనే సంస్థను స్థాపించి ఆ గిరిజనులలో విశ్వాసాన్ని కలిగించాడు 
  • ఈ సంస్థ ద్వారా మతమార్పిడికి సంబంధించిన ప్రయత్నాలు పూర్తిస్థాయిలో ప్రతిఘటించాడు 
  • ముండా తెగకు ముందుండి నాయకత్వం వహించాడు 
  • ముండారాజ్ ను స్థాపించాలి అనుకున్నాడు 
  • ముండా రాజ్ అంటే Self Rule అని అర్థం
  • అడవి పైన అదే విధంగా భూమి పైన పూర్తి స్థాయిలో గిరిజనులకే హక్కు ఉండడం దాన్నే ముండా రాజ్ అంటాము 
  • వలసవాద చట్టాలను అదేవిధంగా శిస్తూ చెల్లించడాన్ని నిరాకరించాడు 
  • ఈయన ఉల్గులన్ అనే ఉద్యమాన్ని ప్రారంభించారు
  • ఈ ఉద్యమంలో గెరిల్లా యుద్ద తంత్రం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. 
  • మతమార్పిడులకు ప్రయత్నించేటటువంటి వారిని దీని ద్వారా తీవ్రంగా వ్యతిరేకించాడు 
  • గిరిజనుల్లో సామాజిక మార్పును తీసుకువచ్చింది 
  • ఈ ఉల్గులన్ ఉద్యమం అనేది ముండారాజ్ సంస్థ ను స్థాపించడానికి కారణమైంది  
  • ఈయన అనుచరులు భగవాన్ గా =} దేవుడిగా 
  • ధరితి అబా గా =} భూమి తండ్రిగా బీర్సా ముండాను కొలవడం జరుగుతుంది
  • ఆయన జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివాస్ గా జరుపుకుంటాం 
  • ఝార్ఖండ్ రాష్ట్రం 2000 నవంబర్ 15 ఏర్పాటు అయింది 
  • భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది 
  • జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి 

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

మాదిగ ఉప వర్గీకరణ

  • ఇటీవల నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని హైదరాబాద్ లో జరిగిన సదస్సులో షెడ్యూల్ కులాల(SC)లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఉప వర్గీకరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఈ సదస్సులో పేర్కొనడం జరిగింది 
  • షెడ్యూల్ కులాలను ఏ,బి,సి,డి గ్రూపులుగా వర్గీకరించడాన్నే SC ఉప వర్గీకరణ గా ప్రస్తావిస్తాం
  • సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేటువంటి పంపిణీ చేపడతాయి
  • 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 
  • మొత్తం ఎస్సీ జనాభా 1,38,78,078 మంది ఉంటే
  • మాదిగలు = 67,02,609 మంది ఉన్నారు,
  • మాలలు = 55,70,244 మంది జనాబా ఉన్నారు  
  • తెలంగాణ రాష్ట్రంలో మొత్తం SC జనాభాలో మాదిగ సామాజిక వర్గం దాదాపు 50% పైగా ఉన్నారు 
  • 1994 నుంచి SC ఉప వర్గీకరణ కోసం పోరాడుతూ, వాదిస్తూ వస్తున్నారు 
  • దానికి కారణం ఎస్సీ కేటగిరి కి కేటాయించిన రిజర్వేషన్స్ అనేవి మాల సామాజిక వర్గం వారే ఎక్కువ లబ్ధి పొందుతున్నారు
  • ఉప వర్గీకరణ చేయడం ద్వారా సమాన ప్రాతిపదికన రిజర్వేషన్లు ఫలాలు అనేవి అందరికీ అందించబడతాయి 
  • మాదిగలు చారిత్రాత్మకంగా చూస్తే చర్మ శుద్ధి , తోలు పని 
  • అదే విధంగా చిన్న చిన్న చేతి పనులు తో సంబంధం కలిగి ఉన్నారని మనం గమనించవచ్చు 
  • వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు అత్యధికంగా మాదిగ సామాజిక వర్గానికే చెందిన వారనే గుర్తించాలి

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

జార్ఖండ్ వ్యవస్థాపక దినోత్సవం

  • బీహార్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2000 ద్వారా భారత దేశంలో 28వ రాష్ట్రంగా జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది
  • బీహార్ కి దక్షిణ దిగువన ఉన్నటువంటి చోటా నాగపూర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కలుపుకొని జార్ఖండ్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావడం అనేది జరిగింది
  • 2000 సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని గుర్తించాలి 
  • భగవాన్ బీర్సా ముండా జయంతి రోజునే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిందని,  
  • జార్ఖండ్ అంటే అర్థం అటవీ భూమి అని పైన చెప్పిన అంశం లో చదువుకొన్నాము 
  • జార్ఖండ్ రాష్ట్రం యొక్క ప్రత్యేకతలు 
  • జార్ఖండ్ రాష్ట్రము గొప్ప ఖనిజ సంపదకు ప్రసిద్ధి చెందింది 
  • యురేనియం, మైకా, బాక్సైట్ , గ్రానైట్ ,గోల్డ్ సిల్వర్, గ్రాఫైట్, డోలమైట్, మ్యాగ్న టైట్, బొగ్గు, ఇనుము, రాగి వంటి గొప్ప ఖనిజ సంపద ఇక్కడ మనకు లభ్యమవుతుంది 
  • 32 శాతం బొగ్గు ఝార్ఖండ్ నుంచి లభిస్తుంది 
  • 25% రాగి జార్ఖండ్ నుంచే పొందడం జరుగుతుంది

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

భారతీయ మహిళా సరికొత్త రికార్డు

  • ప్రముఖ భారతీయ మహిళ స్కై డైవర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్ మహాజాన్ అరుదైన రికార్డును సృష్టించారు 
  • ఎవరెస్టు శిఖరం ముందు 21500 అడుగుల ఎత్తులో ఉన్న హెలికాప్టర్ నుంచి స్కై డైవ్ చేయడం అనేది జరిగింది 
  • అలా స్కై డైవ్ చేసి 17444 అడుగుల ఎత్తులో ఉన్న కాలాపత్తర్ లో సేఫ్ గా లాండ్ అయ్యారు 
  • ప్రపంచంలోనే ఈ తరహా భారీ విన్యాసం చేసిన తొలి మహిళగా చరిత్రలో నిలిచారు 
  • శీతల్ మహాజన్ గతంలో కూడా స్కై డైవింగ్ చేసి ఇప్పటికే పలు రికార్డులను పొందారు 
  • ఈ భారీ విన్యాసాలన్నీ పూర్తి చేసి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

2030 నాటికి తగ్గేది రెండు శాతం ఉద్గారాలే

  • 2015 వ సంవత్సరంలో నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ లోని పారిస్ లో కాప్ 21 కి సంబంధించి ఒక సమావేశం అనేది జరిగింది
  • ఈ సమావేశం యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడింది
  • దీంట్లో మనకు 195 దేశాలు పాల్గొన్నాయి
  • ఈ సమావేశం యొక్క ప్రత్యేకతలు 
  • ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెంటీ గ్రేడ్ లోపు పరిమితం చేయాలని ఈ ఒప్పందంలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది
  • ఇలా హానికరక ఉద్గారాలకు కళ్లెం వేయాలని ఘనంగా మన లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రస్తుతం పోకడాలు ప్రకారం చూస్తే వాటిని సాధించడం కష్టమేనని నిపుణులు చెబుతున్నారు
  • 2030 నాటికి 43% మేరా ఈ ఉద్గారాలను కళ్లెం వేస్తే తప్ప ఈ తీవ్ర దుష్ప్రభావాలను అడ్డుకోవడం సాధ్యం కాదు 
  • ఐరాస యొక్క తాజా నివేదిక ప్రకారం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రెండు శాతం మాత్రమే అడ్డుకట్ట వేయగలమని పేర్కొనడం జరిగింది

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

ప్రభుత్వ ఉద్యోగాలు. మరియు ప్రైవేట్  ఉద్యోగాలకు సంబంధించిన  పూర్తిస్థాయి సమాచారం. ఇక్కడ అందుబాటులో ఉంటుంది. 

వాటిని అందరికంటే ముందుగానే పొందాలి అంటే YouTube Channel నీ Subscribe చేసుకోండి.



Follow Us On :-

INSTAGRAM :-  LINK

TELEGRAM  :- LINK

FACEBOOK  :- LINK

WHAT'S APP  :- LINK 

19/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK

15/11/2023 PDF File :-  LINK

TODAY PDF File  :-  LINK



Comments